MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea: చేతిలో రూ. 10 వేలు ఉంటే చాలు రూ. 60 వేలు సంపాదించ‌వ‌చ్చు.. బెస్ట్ సీజ‌న‌ల్ బిజినెస్ ఐడియాలు

Business Idea: చేతిలో రూ. 10 వేలు ఉంటే చాలు రూ. 60 వేలు సంపాదించ‌వ‌చ్చు.. బెస్ట్ సీజ‌న‌ల్ బిజినెస్ ఐడియాలు

వ్యాపారం చేయాల‌ని ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. కానీ పెట్టుబ‌డికి ఆలోచించి వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే త‌క్కువ పెట్టుబ‌డితో కూడా మంచి లాభాలు ఆర్జించే మార్గాలు ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 24 2025, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సీజ‌న‌ల్ వ్యాపారాలు
Image Credit : Gemini

సీజ‌న‌ల్ వ్యాపారాలు

సీజ‌న్‌కు అనుగుణంగా అవ‌స‌ర‌మ‌య్యే వ్యాపారాల‌ను ప్రారంభించ‌డం వ‌ల్ల మంచి లాభాలు ఆర్జించ‌వ‌చ్చు. ఇలాంటి వ్యాపారాలు కేవ‌లం కొన్ని నెల‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితమ‌వుతాయి. ప్ర‌స్తుతం వర్షాకాలాన్ని క్యాష్ చేసుకుంటే డ‌బ్బులు బాగా సంపాదించ‌వ‌చ్చు. అందులోనూ త‌క్కువ పెట్టుబ‌డితో మంచి లాభాలు పొందొచ్చు. అలాంటి కొన్ని బిజినెస్ ఐడియాలు ఇవే.

26
గొడుగుల వ్యాపారం
Image Credit : Gemini

గొడుగుల వ్యాపారం

వ‌ర్షాకాలం క‌చ్చితంగా అవ‌స‌ర‌మ‌య్యే వాటిలో గొడుగులు ఒక‌టి. మాన్సూన్‌లో మహిళలు, పురుషులు, విద్యార్థులు ఇలా ప్ర‌తీ ఒక్క‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. హోల్‌సేల్‌లో గొడుగుల‌ను ఒక్కోదాన్ని రూ. 100 నుంచి రూ. 120కి కొనుగోలు చేయొచ్చు. 

వీటిని స‌గ‌టును రూ. 200 నుంచి రూ. 300 వ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. ఇలా చూసుకుంటే ఒక్క గొడుగుకు రూ. 100 నుంచి రూ. 150 లాభం పొందొచ్చు. బస్సు స్టాండ్, స్కూల్స్ దగ్గర, రైల్వే స్టేషన్లు, మార్కెట్ల వ‌ద్ద విక్ర‌యించ‌వ‌చ్చు. ఎలాంటి రెంట్ లేకుండా వ్యాపారం చేయొచ్చు.

Related Articles

Related image1
Hyderabad: హైద‌రాబాద్‌లో రియ‌ల్ బూమ్‌.. గ‌జం ధ‌ర అక్ష‌రాల రూ. 2 ల‌క్ష‌లు, ఎక్క‌డంటే..
Related image2
Hyderabad: అల‌ర్ట్‌.. ఈ ప్రాంతాల్లో ప‌వ‌ర్ క‌ట్‌. సాయంత్రం వ‌ర‌కు క‌రెంట్ రాదు.
36
రెయిన్ కోట్‌లు
Image Credit : Gemini

రెయిన్ కోట్‌లు

బైక్‌ల వెళ్లే వారు, విద్యార్థులు రెయిన్ సీజ‌న్‌లో రెయిన్ కోట్‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. కాబ‌ట్టి వీటిని విక్ర‌యిస్తే ఈ సీజ‌న్‌లో మంచి లాభాలు గ‌డించ‌వ‌చ్చు. హోల్‌సేల్లో ఒక్కో రెయిన్ కోట్‌ను రూ. 150 నుంచి రూ. 200 వ‌ర‌కు ఉంటాయి. వీటిని రూ. 300 నుంచి రూ. 400 వ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. ఇలా ఒక్కో దానిపై క‌నీసం రూ. 100 లాభం పొందొచ్చు.

46
వాటర్‌ప్రూఫ్ షూ కవర్
Image Credit : Gemini

వాటర్‌ప్రూఫ్ షూ కవర్

వ‌ర్షాకాలంలో నీటిలో బూట్లు తడవకుండా ఉండేందుకు వీటిని ఉప‌యోగిస్తుంటారు. వీటి ధ‌ర హోల్‌సేల్‌లో కొనుగోలు చేస్తే రూ. 60 నుంచి రూ. 80 ప‌డుతుంది. వీటిని త‌క్కువ‌లో త‌క్కువ రూ. 120 నుంచి రూ. 180 వ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. ఇలా ఒక్కో షూ క‌వ‌ర్‌పై రూ. 60 నుంచి రూ. 100 వ‌ర‌కు లాభం పొందొచ్చు. స్కూల్స్, ఆఫీసులు, ఔట్‌డోర్ వర్కర్స్ సమీపంలో వీటిని విక్ర‌యించ‌వ‌చ్చు.

56
మొబైల్ రెయిన్ కవర్
Image Credit : Gemini

మొబైల్ రెయిన్ కవర్

స్మార్ట్‌ఫోన్ల రక్షణకు చాలా కీలకంగా ప‌నిచేస్తాయి. వ‌ర్షాకాలంలో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తారు. వీటి విక్ర‌యం ద్వారా మంచి లాబాలు పొందొచ్చు. హోల్‌సేల్‌లో మొబైల్ క‌వ‌ర్ల‌ను రూ. 25 నుంచి రూ. 30కి కొనుగోలు చేయొచ్చు. వీటిని త‌క్కువ‌లో త‌క్కువ రూ. 60 నుంచి రూ. 80కి కొనుగోలు చేయొచ్చు. మొబైల్ షాప్స్, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్ల వ‌ద్ద విక్ర‌యించ‌వ‌చ్చు.

66
వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ కవర్
Image Credit : Gemini

వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ కవర్

విద్యార్థులు, డెలివరీ బాయ్స్, ఉద్యోగులకు ఈ బ్యాగ్స్ ఎంత‌గానో అవ‌స‌ర‌ప‌డ‌తాయి. వీటిని హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తే రూ. 30 నుంచి రూ. 40కి పొందొచ్చు. వీటిని రూ. 70 నుంచి రూ. 100కి అమ్మొచ్చు. ఇలా ఒక్కో బ్యాగ్‌కు రూ. 40 నుంచి రూ. 60 లాభం పొందొచ్చు.

పైన తెలిపిన ఈ వ్యాపారాలను ప్రారంభించడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. సరిగ్గా రెండు నెలలు కష్టపడితే తక్కువలో తక్కువ రూ. 60 వేల వరకు ఆర్జించవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Hyderabad: హైద‌రాబాద్‌లో రియ‌ల్ బూమ్‌.. గ‌జం ధ‌ర అక్ష‌రాల రూ. 2 ల‌క్ష‌లు, ఎక్క‌డంటే..
Recommended image2
Hyderabad: అల‌ర్ట్‌.. ఈ ప్రాంతాల్లో ప‌వ‌ర్ క‌ట్‌. సాయంత్రం వ‌ర‌కు క‌రెంట్ రాదు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved