MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాంకుల నుంచి వచ్చే అనవసర కాల్స్‌ తో విసిగిపోయారా? ఈ చిన్న పనితో వాటిని ఆపేయండి

బ్యాంకుల నుంచి వచ్చే అనవసర కాల్స్‌ తో విసిగిపోయారా? ఈ చిన్న పనితో వాటిని ఆపేయండి

Unwanted calls: లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ కావాలా? అంటే అనేక కాల్స్ వివిధ బ్యాంకుల నుంచి వస్తూ ఉంటాయి. రోజులో అయిదారుసార్లు కాల్స్ వస్తూ ఉంటాయి. వాటితో విసిగిపోతూ ఉంటే చిన్న చిట్కాల ద్వారా వాటి నుంచి తప్పించుకోవచ్చు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 27 2025, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విసిగించే ఫోన్ కాల్స్
Image Credit : Pixabay

విసిగించే ఫోన్ కాల్స్

ఫోన్‌ మోగిందంటే లోన్‌ కావాలా? క్రెడిట్ కార్డ్‌ తీసుకోండి, లోన్ పై ప్రత్యేక ఆఫర్ ఉంది... అనే కాల్స్‌తో చిరాకు పెట్టేస్తారు. ముఖ్యంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి ఈ ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి. ఈ కాల్స్ వల్ల కేవలం ఇబ్బందే కాదు, కొన్నిసార్లు మోసాలకు కూడా గురవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. చిన్న చిన్న పనుల ద్వారా ఆ కాల్స్ రాకుండా అడ్డుకోవచ్చు. మీకు కూడా ఆ ఫోన్ కాల్స్ నుంచి మీకు విముక్తి కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

25
1909కి ఒక్క మెసేజ్
Image Credit : Pixabay

1909కి ఒక్క మెసేజ్

టెలికాం నియంత్రణ సంస్థ TRAI (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వినియోగదారుల రక్షణ కోసం డూ నాట్ డిస్టర్బ్ (DND) సేవను అందిస్తోంది. దీని ద్వారా మీ మొబైల్ నంబర్‌పై వచ్చే అన్ని ప్రమోషనల్ కాల్స్, SMSలను ఆపివేయవచ్చు. అందుకోసం మీరు START 0 అని టైప్ చేసి 1909 నంబర్‌కి SMS పంపాలి. దీంతో అన్ని రకాల మార్కెటింగ్ కాల్స్, సందేశాలు పూర్తిగా రావడం ఆగిపోతాయి. మీరు కేవలం బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ ప్రకటనలనే ఆపాలనుకుంటే... BLOCK 1 అని 1909కి మెసేజ్ పంపండి.

Related Articles

Related image1
Army Salary: ఆర్మీలో చేరిన వారికి జీతాలు ఎంత? ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి?
Related image2
Powerful passport: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. అమెరికా మాత్రం కాదు
35
TRAI DND యాప్‌
Image Credit : Pixabay

TRAI DND యాప్‌

స్మార్ట్‌ఫోన్‌ వాడేవారికి TRAI అధికారిక DND యాప్‌ కూడా అందుబాటులో ఉంది. గూగుల్‌ ప్లే స్టోర్ లేదా యాప్‌ స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసి, మీ మొబైల్‌ నంబర్‌ నమోదు చేయండి. ఆ తర్వాత మీరు ఏ రకమైన ప్రమోషనల్‌ కాల్స్‌ రావాలనుకుంటున్నారో లేదా రాకూడదో ఎంపిక చేసుకోవచ్చు. unwanted calls వస్తే అదే యాప్‌ ద్వారా నేరుగా ఫిర్యాదు కూడా చేయవచ్చు.

45
ఎలా ఫిర్యాదు ఎలా చేయాలి?
Image Credit : Pixabay

ఎలా ఫిర్యాదు ఎలా చేయాలి?

మీరు ఇప్పటికే DND యాప్ ను వాడుతూ ఉన్నా కూడా ఇంకా అనవసర కాల్స్ వస్తుంటే ఆ నంబర్‌, తేదీ వివరాలను 1909కి SMSగా పంపండి. TRAI దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది.

55
బ్యాంకుల వెబ్ సైట్లలో కూడా
Image Credit : Pixabay

బ్యాంకుల వెబ్ సైట్లలో కూడా

బ్యాంకుల వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌లలో Do Not Call Registry అనే విభాగం ఉంటుంది. మీరు అక్కడ మీ ఖాతాకు సంబంధించిన మార్కెటింగ్‌ కాల్స్‌ పూర్తిగా నిలిపేయమని అభ్యర్థించవచ్చు. అయితే సర్వీస్‌ సంబంధిత సమాచారమైన ట్రాన్సాక్షన్‌ అలర్ట్స్‌, OTPలు మొదలైనవి మాత్రం కొనసాగుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
Army Salary: ఆర్మీలో చేరిన వారికి జీతాలు ఎంత? ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి?
Recommended image2
Powerful passport: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. అమెరికా మాత్రం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved