MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Tata Altroz: కేవలం రూ.6.89 లక్షలకే కొత్త టాటా ఆల్ట్రోజ్: 50కి పైగా ఫీచర్లు

Tata Altroz: కేవలం రూ.6.89 లక్షలకే కొత్త టాటా ఆల్ట్రోజ్: 50కి పైగా ఫీచర్లు

Tata Altroz: టాటా కంపనీ కొత్త ఫీచర్లతో తన ‘ఆల్ట్రోజ్’ మోడల్ కారుని గురువారం విడుదల చేసింది. ముంబైలోని పోవైలో జరిగిన కార్యక్రమంలో కొత్త ఆల్ట్రోజ్ కారును లాంచ్ చేశారు. ఈ కారు ఫీచర్లు, ధర, మైలేజ్ తదితర వివరాలు తెలుసుకుందాం రండి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 25 2025, 12:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
5 సంవత్సరాలుగా ప్రజాదరణ
Image Credit : our own

5 సంవత్సరాలుగా ప్రజాదరణ

టాటా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ కారుని కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. ముంబైలోని పోవైలో జరిగిన కార్యక్రమంలో కొత్త కారును లాంచ్ చేశారు. గత 5 సంవత్సరాలుగా ఆల్ట్రోజ్ ప్రజాదరణ పొందుతోంది. అందుకే 2025 వెర్షన్ ను తీసుకొచ్చారు. ఇది అత్యాధునిక డిజైన్, టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్‌తో వస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. 

25
కొత్త కారు ధర ఎంతంటే..
Image Credit : Google

కొత్త కారు ధర ఎంతంటే..

సామాన్యులు కూడా కారు కొనుగోలు చేయగలిగేలా టాటా కంపెనీ న్యానో కారును తయారు చేసింది. అయితే అది అంతగా జనానికి నచ్చలేదు. అందుకే టాటా కంపెనీ 2020 జనవరి 22న మొదటి ఆల్ట్రోజ్ కారును విడుదల చేసింది. 

ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసింది. కొత్త ఆల్ట్రోజ్ ప్రారంభ ధర రూ.6.89 లక్షలు. 

Related Articles

Related image1
7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
Related image2
Food: ఇండియాలో స్ట్రీట్‌ ఫుడ్‌ తినాలంటే ఈ నగరంలోనే తినాలి.. ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా ప్రశంసలు
35
5 రంగుల్లో కొత్త కారు
Image Credit : Tata website

5 రంగుల్లో కొత్త కారు

ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ, ఎంబర్ గ్లో, డ్యూన్ గ్లో రంగుల్లో లభిస్తుంది. జూన్ 2 నుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లలో లభించే ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్, కొత్త 5-స్పీడ్ AMT, 6-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌లు కలిగి ఉంది. 

45
కొత్త ఆల్ట్రోజ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు
Image Credit : Asianet News

కొత్త ఆల్ట్రోజ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు

కారులో సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు భద్రత కూడా ముఖ్యం. కొత్త ఆల్ట్రోజ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో 5-స్టార్ రేటింగ్ పొందింది. 360 డిగ్రీ కెమెరా వ్యవస్థ కూడా ఉంది.

కొత్త ఆల్ట్రోజ్ డిజైన్‌లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. భారతదేశం, బ్రిటన్, ఇటలీలోని టాటా డిజైన్ స్టూడియో సిబ్బంది వర్చువల్ రియాలిటీ ద్వారా కలిసి పనిచేసి దీన్ని డిజైన్ చేశారు.

55
50కి పైగా కొత్త ఫీచర్లు
Image Credit : X roaders Twitter

50కి పైగా కొత్త ఫీచర్లు

కొత్త ఆల్ట్రోజ్‌లో రెండు LED స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, మరొకటి 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, 90-డిగ్రీ ఓపెనింగ్ డోర్లు, వాయిస్ యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ  టెయిల్ ల్యాంప్స్, లగ్జరీ సీట్లు, అల్లాయ్ వీల్స్ వంటి 50కి పైగా కొత్త ఫీచర్లు ఉన్నాయి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
Recommended image2
Food: ఇండియాలో స్ట్రీట్‌ ఫుడ్‌ తినాలంటే ఈ నగరంలోనే తినాలి.. ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా ప్రశంసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved