MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Mobile tariff hike: భారీగా పెర‌గ‌నున్న మొబైల్ రీఛార్జ్ ధ‌ర‌లు.. ఎంత‌లా అంటే.

Mobile tariff hike: భారీగా పెర‌గ‌నున్న మొబైల్ రీఛార్జ్ ధ‌ర‌లు.. ఎంత‌లా అంటే.

ప్ర‌స్తుతం దేశంలో టెలికం కంపెనీల మ‌ధ్య పోటీ పెరిగింది. జియో రాక‌తో రీఛార్జ్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. అయితే గ‌తేడాది జియో స‌హా అన్ని కంపెనీలు టారిఫ్‌ల‌ను భారీగా పెంచాయి. అయితే మ‌రోసారి యూజ‌ర్ల‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి టెలికం కంపెనీలు.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 07 2025, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మళ్లీ పెరుగనున్న మొబైల్ టారిఫ్ ధరలు
Image Credit : pinterest

మళ్లీ పెరుగనున్న మొబైల్ టారిఫ్ ధరలు

దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు మ‌రోసారి టారిఫ్‌ల‌ను పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే గతేడాది ధరలు పెంచిన టెలికాం సంస్థలు, ఈ ఏడాది చివరికి మరోసారి రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. తాజా ట్రెండ్‌ను బట్టి చూస్తే 10 నుంచి 12 శాతం వరకు టారిఫ్‌ల పెంపు జరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

25
పెరిగిన యాక్టివ్ యూజర్ల సంఖ్య
Image Credit : stockPhoto

పెరిగిన యాక్టివ్ యూజర్ల సంఖ్య

మే 2025లో దేశవ్యాప్తంగా మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. కేవలం ఆ ఒక్క నెలలోనే దాదాపు 74 లక్షల మంది కొత్త సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నట్లు టెలికాం డేటా సూచిస్తోంది. 

ఇందులో రిలయన్స్ జియోకే 55 లక్షల మంది కొత్త వినియోగదారులు జత కాగా, ఎయిర్‌టెల్‌కు 13 లక్షల మంది చేరారు. ఈ పెరుగుదల, కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపినా, కొనసాగుతున్న పెట్టుబడుల వ్యయం కారణంగా టారిఫ్ పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

Related image1
Andhra Pradesh: ఐటీ, లాజిస్టిక్ హ‌బ్‌గా ఏపీలోని ఆ ప్రాంతం.. ఎయిర్‌పోర్ట్ రాక‌తో మారుతోన్న భ‌విత‌వ్యం
Related image2
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
35
ఆ ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం
Image Credit : stockPhoto

ఆ ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం

ఈసారి బేసిక్ రీఛార్జ్ ప్లాన్లను పెంచే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. బదులుగా, మధ్య, అధిక శ్రేణికి చెందిన డేటా ప్లాన్లపై ఛార్జీలు పెంచే యోచనలో టెలికాం సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. డేటా వినియోగం, వేగంపై ఆధారపడి ప్యాకేజీలను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఎక్కువ డేటా వాడే వారికి ఛార్జీల మోత త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.

45
డేటా పరిమితిపై కోత, కొత్త విధానాలు
Image Credit : Pinterest

డేటా పరిమితిపై కోత, కొత్త విధానాలు

భవిష్యత్తులో కొన్ని రీఛార్జ్ ప్లాన్లలో డేటా పరిమితిని తగ్గించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కార‌ణంగా యూజ‌ర్లు అదనంగా డేటా కొనుగోలు చేయాల్సిన అవసరం రావొచ్చు. ఇలా డేటా ప్యాక్‌ల ద్వారా కంపెనీలు ఆదాయాన్ని పెంచుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కంపెనీలు సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా డేటా-అప్‌గ్రేడ్‌ మోడల్‌ను ప్రోత్సహించే అవకాశముంది.

55
టారిఫ్ మార్పులు తప్పవు
Image Credit : Asianet News

టారిఫ్ మార్పులు తప్పవు

మొబైల్ ధరల పెంపు గురించి ఇప్పటికే టెలికాం సంస్థల అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత టారిఫ్‌లు యూజర్‌ అప్‌గ్రెడేషన్‌కు సరిపోవట్లేదని, అధిక నాణ్యత సేవల కోసం ఖర్చులు పెరుగుతున్నాయని ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విట్టల్ వ్యాఖ్యానించారు.

 వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ రివిజన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్ విస్తరణ, సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంస్థలు ఛార్జీల‌ను పెంచేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Andhra Pradesh: ఐటీ, లాజిస్టిక్ హ‌బ్‌గా ఏపీలోని ఆ ప్రాంతం.. ఎయిర్‌పోర్ట్ రాక‌తో మారుతోన్న భ‌విత‌వ్యం
Recommended image2
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved