MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • PPF అకౌంట్‌లో డబ్బును ఎన్నేళ్ల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు? 15 ఏళ్లు ఆగాల్సిందేనా?

PPF అకౌంట్‌లో డబ్బును ఎన్నేళ్ల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు? 15 ఏళ్లు ఆగాల్సిందేనా?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF).. టెన్షన్ లేకుండా చేసే చక్కటి సేవింగ్స్ స్కీమ్ ఇది. ఖాతాదారులకు ఎంతో భద్రతనిస్తుంది. ఇందులో దాచుకున్న డబ్బులు మెచ్యురిటీ కాకుండానే అవసరాలకు వాడుకోవచ్చు. కాని ఎన్ని సంవత్సరాల తర్వాత విత్ డ్రా చేయొచ్చో తెలుసుకుందాం.     

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 21 2025, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
15 సంవత్సరాల పొదుపు స్కీమ్
Image Credit : Gemini

15 సంవత్సరాల పొదుపు స్కీమ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది మన దేశంలో చాలా ఫేమస్ సేవింగ్స్ స్కీమ్. ప్రజల్లో పొదుపు ఆలోచనలను పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో 15 సంవత్సరాల పాటు డబ్బు దాచుకోవాలి.  మెచ్యూరిటీ తర్వాత మొత్తం తీసుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 15 ఏళ్లకు ముందే డబ్బు తీసుకోవచ్చని చాలా మందికి తెలియదు.

25
ఎప్పుడు డబ్బు తీసుకోవచ్చు?
Image Credit : Gemini

ఎప్పుడు డబ్బు తీసుకోవచ్చు?

PPF ఖాతా ఓపెన్ చేసిన 6 సంవత్సరాల తర్వాత అకౌంట్ నుంచి కొద్దిగా డబ్బు తీసుకోవచ్చు. ఉదాహరణకి 2020లో PPF ఖాతా ఓపెన్ చేశారనుకోండి.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో నుంచి డబ్బు తీసుకోవచ్చు.

Related Articles

Related image1
Best Summer Business Idea: వేసవిలో ఈ బిజినెస్ కి తిరుగేలేదు.. ఎగబడి మరీ టికెట్స్ కొంటారు
Related image2
Electric Car: టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో టాటా కార్లే మూడున్నాయ్.. అవేంటో తెలుసా?
35
ఏ పరిస్థితుల్లో డబ్బు తీసుకోవచ్చు?
Image Credit : freepik

ఏ పరిస్థితుల్లో డబ్బు తీసుకోవచ్చు?

పిల్లల ఉన్నత విద్య కోసం PPF ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చినపుడు కూడా ఈ స్కీమ్ లో కొంత డబ్బు తీసుకోవచ్చు. మీకు అత్యవసర వైద్య చికిత్స అందించాల్సి వచ్చినా ఈ డబ్బు వాడుకోవచ్చు. 

అయితే మెచ్యూరిటీకి ముందు డబ్బు తీసుకుంటే ఆ మొత్తంపై 1% వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. 

45
ఎంత డబ్బు తీసుకోవచ్చు?
Image Credit : freepik

ఎంత డబ్బు తీసుకోవచ్చు?

మధ్యలో తీసుకొనే డబ్బుకు కూడా లిమిట్ ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తంలో 50% వరకు మాత్రమే తీసుకోవచ్చు.

ఉదాహరణకి మీరు డబ్బు తీసుకోవాలనుకుంటే ఆ ఏడాది ముందు నాలుగవ సంవత్సరం చివర్లో మీ బ్యాలెన్స్ రూ.1 లక్ష ఉంటే మీరు రూ.50,000 వరకు మాత్రమే తీసుకోవచ్చు.

55
మెచ్యూరిటీ తర్వాత?
Image Credit : Gemini

మెచ్యూరిటీ తర్వాత?

ఒక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పీపీఎఫ్ డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. అదే సంవత్సరం మళ్లీ డబ్బు తీసుకోవాలంటే వీలుకాదు.

15 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మీరు మొత్తం డబ్బు తీసుకోవచ్చు. లేదా నెలనెలా తీసుకునే విధంగా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా పీపీఎఫ్ డబ్బును తీసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా రిటైర్డ్ వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రభుత్వ పథకాలు
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Best Summer Business Idea: వేసవిలో ఈ బిజినెస్ కి తిరుగేలేదు.. ఎగబడి మరీ టికెట్స్ కొంటారు
Recommended image2
Electric Car: టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో టాటా కార్లే మూడున్నాయ్.. అవేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved