MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • PPF: ప్రతీ నెల మీకొచ్చే రూ. 2 వేల పెన్షన్ పక్కన పెడితే.. 6 లక్ష‌లు మీ సొంతం చేసుకోవ‌చ్చు

PPF: ప్రతీ నెల మీకొచ్చే రూ. 2 వేల పెన్షన్ పక్కన పెడితే.. 6 లక్ష‌లు మీ సొంతం చేసుకోవ‌చ్చు

PPF: సంపాదించే డబ్బును భద్రంగా పెట్టుబడి పెట్టి, భవిష్యత్తుకు ఉపయోగపడే నిధిగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. రూ. 2 వేల పెన్ష‌న్‌తో ఎంత డ‌బ్బు సృష్టించ‌వ‌చ్చో తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 18 2026, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీపీఎఫ్ స్కీమ్ అంటే ఏంటి?
Image Credit : Getty

పీపీఎఫ్ స్కీమ్ అంటే ఏంటి?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక దీర్ఘకాలిక ప్రభుత్వ పొదుపు పథకం. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల ద్వారా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడికి భారత ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది. అందుకే ఇది రిస్క్ లేని పెట్టుబడిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ పూర్తిగా పన్ను రహితం.

25
పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు
Image Credit : Getty

పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు

పీపీఎఫ్ స్కీమ్‌కు ఉండే ప్రధాన ఆకర్షణ పన్ను మినహాయింపులు.

* పెట్టుబడి మొత్తం 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

* పెట్టుబడిపై వచ్చే వడ్డీపై పన్ను లేదు.

* మెచ్యూరిటీ సమయంలో పొందే మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం. అంటే ఇది EEE (Exempt–Exempt–Exempt) క్యాటగిరీ స్కీమ్.

Related Articles

Related image1
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. మోస‌పోయే ప్ర‌మాదం ఎక్కువ
Related image2
Zodiac signs: మ‌క‌ర రాశిలోకి బుధుడు ప్ర‌వేశం.. ఇక‌ ఈ 3 రాశుల వారికి బిందాస్
35
నెలకు రూ.2000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
Image Credit : social media

నెలకు రూ.2000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?

ఒక‌వేళ మీరు ఈ ప‌థ‌కంలో నెల‌వారీ పెట్టుబ‌డి రూ. 2000 పెట్టార‌నుకుందాం. దీంతో వార్షిక పెట్టుబడి రూ.24,000 అవుతుంది. పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు ఉంటుంది. దీంతో మీరు పెట్టిన మొత్తం పెట్టుబ‌డి రూ. 3,60,000 అవుతుంది. ప్రస్తుతం ఈ ప‌థ‌కంలో 7.1% వడ్డీ ల‌భిస్తుంది. దీంతో 15 ఏళ్ల తర్వాత మీకు సుమారు రూ.6,08,000 మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది. అంటే మీ పెట్టుబడిపై దాదాపు రూ.2.48 లక్షల వడ్డీ ఆదాయం పొందినట్టే. చిన్న మొత్తంతో ప్రారంభించినా, క్రమశిక్షణతో కొనసాగిస్తే మంచి నిధి సిద్ధమవుతుంది.

45
పీపీఎఫ్ ఖాతా నిబంధనలు, సౌకర్యాలు
Image Credit : adobe stock

పీపీఎఫ్ ఖాతా నిబంధనలు, సౌకర్యాలు

* కనీస పెట్టుబడి: రూ.500 సంవత్సరానికి

* గరిష్ట పెట్టుబడి: రూ.1.5 లక్షలు సంవత్సరానికి

* లాక్-ఇన్ కాలం: 15 సంవత్సరాలు

* 15 ఏళ్ల తర్వాత ఖాతాను ప్రతి 5 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం

* 5వ సంవత్సరం తర్వాత పాక్షిక ఉపసంహరణ సదుపాయం

* 3వ సంవత్సరం నుంచి రుణ సౌకర్యం కూడా లభిస్తుంది

55
ఈ స్కీమ్ ఎవ‌రికి ఉపయోగపడుతుంది?
Image Credit : adobe stock

ఈ స్కీమ్ ఎవ‌రికి ఉపయోగపడుతుంది?

భవిష్యత్తు కోసం భద్రమైన పొదుపు కోరుకునేవారు, పన్ను భారం తగ్గించుకోవాలనుకునేవారు, రిస్క్ తీసుకోకుండా దీర్ఘకాల పెట్టుబడి చేయాలనుకునేవారు, జీతం తీసుకునే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వారికి ఈ ప‌థ‌కం మంచి ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. చిన్న మొత్తంతో మొదలుపెట్టి, నెమ్మదిగా లక్షల రూపాయల నిధిని సృష్టించాలంటే పీపీఎఫ్ మంచి ఎంపిక.

గమనిక: ఇక్కడ ఇచ్చిన వడ్డీ రేట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని వివరించాం. వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. పెట్టుబడి నిర్ణయాలకు ముందు అధికారిక సమాచారం పరిశీలించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. మోస‌పోయే ప్ర‌మాదం ఎక్కువ
Recommended image2
Zodiac signs: మ‌క‌ర రాశిలోకి బుధుడు ప్ర‌వేశం.. ఇక‌ ఈ 3 రాశుల వారికి బిందాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved