MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Post office: మీ డ‌బ్బులే డ‌బ్బుల‌ను సంపాదిస్తాయి.. ఈ స్కీమ్‌తో ప్రతీ నెల మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయ్

Post office: మీ డ‌బ్బులే డ‌బ్బుల‌ను సంపాదిస్తాయి.. ఈ స్కీమ్‌తో ప్రతీ నెల మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయ్

Post office: మారుతోన్న ఆర్థిక అవ‌స‌రాల నేపథ్యంలో నిరంత‌ర ఆదాయం కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ప‌ద‌వి విర‌మ‌ణ త‌ర్వాత నెల‌వారీ ఖ‌ర్చుల‌కు డ‌బ్బు అవ‌స‌ర‌ప‌డుతుంది. అలాంటి వారి కోస‌మే పోస్టాఫీస్ MIS పేరుతో మంచి స్కీమ్ తీసుకొచ్చింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 19 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్ అంటే ఏమిటి?
Image Credit : Generated by google gemini AI

పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్ అంటే ఏమిటి?

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా స్థిర ఆదాయం ఇచ్చే సేవింగ్ స్కీమ్. ఈ పథకం ముఖ్యంగా నెలవారీ ఆదాయం కావాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. పదే పదే డబ్బు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒకే సారి పెట్టుబడితో ఆదాయం వస్తుంది.

25
MIS స్కీమ్ వడ్డీ రేటు, నెలవారీ ఆదాయం
Image Credit : India post

MIS స్కీమ్ వడ్డీ రేటు, నెలవారీ ఆదాయం

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై పోస్ట్ ఆఫీస్ 7.4 శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెలా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. వచ్చిన డబ్బును ఖాతాలో ఉంచుకోవచ్చు లేదా అవసరమైతే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఆదాయం పూర్తిగా ఫిక్స్‌గా ఉంటుంది.

Related Articles

Related image1
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Related image2
Food: చికెన్ లివ‌ర్ వ‌ర్సెస్ మ‌ట‌న్ లివ‌ర్‌.. రెండింటీ మ‌ధ్య తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది.?
35
పెట్టుబడి పరిమితులు ఎలా ఉంటాయి?
Image Credit : our own

పెట్టుబడి పరిమితులు ఎలా ఉంటాయి?

ఈ స్కీమ్‌లో ఖాతా తెరవడానికి కనీసం రూ.1000 పెట్టుబడి సరిపోతుంది. సింగిల్ అకౌంట్ లో గరిష్ఠ పెట్టుబడి: రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ లో గరిష్ఠ పెట్టుబడి: రూ.15 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్‌లో గరిష్ఠంగా ముగ్గురు సభ్యులు ఉండవచ్చు.

45
నెలకు రూ.5550 ఆదాయం ఎలా వస్తుంది?
Image Credit : Asianet News

నెలకు రూ.5550 ఆదాయం ఎలా వస్తుంది?

మీరు సింగిల్ అకౌంట్‌లో ఒకే సారి రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ.5550 వడ్డీ వస్తుంది. ఈ మొత్తం 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నెలవారీ ఖర్చులకు ఇది నమ్మకమైన ఆదాయ వనరుగా మారుతుంది. ఒక‌వేళ గరిష్ఠంగా రూ. 15 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెడితే నెల‌కు సుమారు రూ. 9500 పొందొచ్చు.

55
మెచ్యూరిటీ, అకౌంట్ ఓపెనింగ్ విధానం
Image Credit : Google

మెచ్యూరిటీ, అకౌంట్ ఓపెనింగ్ విధానం

ఈ MIS స్కీమ్ కాలవ్యవధి 5 సంవత్సరాలు. గడువు పూర్తయిన తర్వాత మీరు పెట్టిన మొత్తం డబ్బు పూర్తిగా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. పెట్టుబడి మొత్తం సురక్షితంగా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఖాతా ఓపెన్ చేసిన వెంటనే నెలవారీ ఆదాయం ప్రారంభమవుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Recommended image2
Food: చికెన్ లివ‌ర్ వ‌ర్సెస్ మ‌ట‌న్ లివ‌ర్‌.. రెండింటీ మ‌ధ్య తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved