MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మే 31 లోపు మీ అకౌంట్‌లో రూ.436 లేకపోతే ఈ పాలసీ క్యాన్సిల్ అవుతుంది

మే 31 లోపు మీ అకౌంట్‌లో రూ.436 లేకపోతే ఈ పాలసీ క్యాన్సిల్ అవుతుంది

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ బీమా పథకంలో సభ్యులు మే 31 లోపు వారి అకౌంట్ లో రూ.436 ఉంచుకోవాలి. అలా చేయకపోతే పాలసీ రద్దు అవుతుందని అధికారులు ప్రకటించారు. ఆ బీమా పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 10 2025, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో సభ్యులుగా ఉన్న ఖాతాదారులు తమ పాలసీని కొనసాగించాలంటే మే 31, 2025లోపు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలో కనీసం రూ.436 ఉండేలా చూసుకోవాలి. ఈ మొత్తం ఆటో డెబిట్ విధానంలో ఖాతా నుండి కట్ అవుతుంది. మే 31 లోపు ఈ అమౌంట్ మెయింటెయిన్ చేయని వారి పాలసీ రద్దు అవుతుందని అధికారులు ప్రకటించారు. 

25

18 ఏళ్లు దాటిన వారికి ఈ పాలసీ

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2015లో ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ఆధారిత జీవిత బీమా పథకం. ఈ పథకం కింద 18 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వ్యక్తులు సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. ఏ కారణంతోనైనా వారు మరణించినప్పుడు రూ.2 లక్షల బీమా నగదు పొందవచ్చు. ఈ పాలసీ ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు అమలులో ఉంటుంది.

 

Related Articles

Related image1
PM Kisan: ఇవి లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు
Related image2
ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
35

ఆటో డెబిట్ అవుతుంది

ఈ పాలసీని తీసుకున్న సభ్యులు పాలసీని కొనసాగించాలంటే మే 25 నుండి మే 31 మధ్యలో ఖాతాలో రూ.436 ఉంచుకోవాలి. ఈ మొత్తం ఆటో డెబిట్ ద్వారా ఖాతా నుండి తీసుకుంటారు. అందువల్ల పాలసీని కొనసాగించాలనుకునే వారు ఈ తేదీల్లో వారి అకౌంట్స్ లో అవసరమైన మొత్తాన్ని ఉంచాలి.

45

పాలసీ రద్దయితే తిరిగి ప్రారంభించడం ఇబ్బందే..

పాలసీ రద్దు కాకుండా ఉండాలంటే ఖాతాదారులు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేయకపోతే పాలసీ రద్దు అవుతుంది. ఒకవేళ పాలసీ రద్దు అయితే తిరిగి చేరడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే అధికారులకు మెడికల్ సర్టిఫికేట్, ఆధార్, బ్యాంకు పాస్ బుక్ లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 

55

బీమా నగదు రూ.2 లక్షలు

ఈ పథకంలో చేరిన పాలసీదారులు అనుకోకుండా మరణిస్తే వారి నామినీకి రూ.2 లక్షల బీమా సొమ్ము ఇస్తారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవిత బీమా సౌకర్యం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తోంది.

ఖాతాదారులు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. పాలసీని కొనసాగించాలంటే, మే 31లోపు ఖాతాలో రూ.436 ఉండేలా చూసుకోవాలి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Recommended image2
Copper: రాగి ధ‌ర‌లు పెరుగుతున్నాయి స‌రే.. ఇంత‌కీ రాగిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసా.?
Recommended image3
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Related Stories
Recommended image1
PM Kisan: ఇవి లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు
Recommended image2
ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved