MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • OYO: ఓయో ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.? క‌స్ట‌మ‌ర్లను ఎమోష‌న్‌తో కొట్టారుగా

OYO: ఓయో ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.? క‌స్ట‌మ‌ర్లను ఎమోష‌న్‌తో కొట్టారుగా

ఓయో పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన ప‌నిలేదు. రూమ్ బుకింగ్ ప్రాసెస్ అత్యంత సుల‌భ‌త‌రం చేసిన ఈ కంపెనీ దేశంలోనే కాకుండా ఇత‌ర దేశాల‌కు విస్త‌రించి మంచి లాభాలు ఆర్జించింది. కాగా ఓయోకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 05 2025, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓయో రూమ్స్ స్థాపన
Image Credit : Social Media

ఓయో రూమ్స్ స్థాపన

2012లో రితేష్ అగర్వాల్ ఓయో రూమ్స్‌ను ప్రారంభించారు. మొదట కంపెనీ పేరు Oravel Stays. కానీ 2013లో పీటర్ థీల్ (PayPal సహ వ్యవస్థాపకుడు) అందించిన $100,000 Thiel Fellowship గ్రాంట్‌ తర్వాత దీనిని OYOగా మార్చారు. ఆరంభంలో కేవలం 5 హోటళ్లతో గుళ్గావ్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేల హోటళ్లు నిర్వహిస్తోంది.

DID YOU
KNOW
?
ఓయో కంటే ముందు..
2012లో రితేష్ అగర్వాల్ ఓయో రూమ్స్‌ను ప్రారంభించారు. మొదట కంపెనీ పేరు Oravel Stays.
25
ఓయో ఫుల్ ఫామ్ ఏంటి.?
Image Credit : our own

ఓయో ఫుల్ ఫామ్ ఏంటి.?

ఓయో పేరుతోనే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించింద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. అయితే ఫుల్ ఫామ్ గురించి చాలా మందికి తెలియ‌దు. On Your Own అనేది ఓయో ఫుల్ ఫామ్. అంటే, ఓయో రూమ్ ను కస్టమర్లు తమ సొంత గదిలా భావించాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. కస్టమర్లను ఎమోషనల్‌గా క‌నెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పేరును పెట్టారు.

Related Articles

Related image1
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. బండి బ‌య‌ట‌కు తీసే ముందే ఈ విష‌యం తెలుసుకోండి.
Related image2
మీ ఇంట్లో క‌రెంట్ స‌మ‌స్య ఉందా.? వాట్సాప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు. ఎలాగంటే
35
ప‌లు కంపెనీల పెట్టుబ‌డులు
Image Credit : others

ప‌లు కంపెనీల పెట్టుబ‌డులు

మొద‌ట్లో చిన్న కంపెనీగా మొద‌లైన ఆ త‌ర్వాత క్ర‌మంగా లాభాల‌ను ఆర్జించింది. దీంతో ఈ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు సైతం పెట్టుబ‌డులు పెట్టాయి. వీటిలో ప్ర‌ధానంగా SoftBank Group, Airbnb, Sequoia India, Lightspeed India వంటి కంపెనీలు భారీగా పెట్టుబ‌డి పెట్టాయి.

45
ఓయో వ్యవస్థాపకుడి గురించి
Image Credit : our own

ఓయో వ్యవస్థాపకుడి గురించి

ఓయోను రితేష్ అగర్వాల్ ప్రారంభించారు. ఆయ‌న నవంబర్ 16, 1993న ఒడిశా రాష్ట్రం, బిస్సం కటక్‌లో జ‌న్మించారు. చిన్న వయసులోనే వ్యాపార దృక్పథం పెంచుకున్న రితేష్, 19 ఏళ్లకే ఓయో ప్రారంభించారు. Hurun India Rich List 2024 ప్రకారం, ఆయన భారతదేశంలో టాప్ 10 యువ బిలియనీర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. రితేష్ నికర సంపద సుమారు రూ.1,900 కోట్లు ($225 మిలియన్)గా ఉంది. రితేష్ అన్అకాడ‌మీ, కార్స్‌24, జింగ్ బ‌స్‌, టాఫీ కిడ్స్ వంటి స్టార్ట‌ప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టారు.

55
ఓయో IPO వివరాలు
Image Credit : gemini

ఓయో IPO వివరాలు

ఓయో ఇంత వ‌ర‌కు ఐపీఓకి వెళ్ల‌లేదు. అయితే 2025 నవంబర్‌లో DRHP ఫైలింగ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ విలువను $7-8 బిలియన్‌గా అంచనా వేస్తున్నారు. షేర్ ధరను రూ. 70 చొప్పున ఉంచే అవకాశం ఉంది. IPO నిర్వహణకు సంబంధించి Axis, Citi, Goldman Sachs, ICICI వంటి బ్యాంకులు చర్చల్లో పాల్గొంటున్నాయి. మొత్తం మీద ఓయో రూమ్స్‌ తక్కువ ధరల్లో వసతి సౌకర్యం అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా క్ర‌మంగా ఎదుగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. బండి బ‌య‌ట‌కు తీసే ముందే ఈ విష‌యం తెలుసుకోండి.
Recommended image2
మీ ఇంట్లో క‌రెంట్ స‌మ‌స్య ఉందా.? వాట్సాప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు. ఎలాగంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved