MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Nothing Phone 3 5G: నథింగ్ ఫోన్ 3 5G పై రూ. 20 వేల తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్

Nothing Phone 3 5G: నథింగ్ ఫోన్ 3 5G పై రూ. 20 వేల తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్

Nothing Phone 3 5G: నథింగ్ ఫోన్ 3 5G పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు ప్రకటించింది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో దాదాపు 80 వేల ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను కేవలం రూ. 49,900కే పొందవచ్చు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 26 2025, 10:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నథింగ్ ఫోన్ 3 5G భారీ తగ్గింపులు
Image Credit : Nothing@X

నథింగ్ ఫోన్ 3 5G భారీ తగ్గింపులు

ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన నథింగ్ ఫోన్ 3 5జీ పై భారీ తగ్గింపులు ప్రటించారు. ఫ్లిప్‌కార్ట్‌లో విడుదలైన నథింగ్ ఫోన్ 3 5G పై ఆశ్చర్యకరమైన సూపర్ తగ్గింపులు లభిస్తున్నాయి. మార్కెట్‌లోకి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ.79,999 ధరలో విడుదలైంది. 

అయితే, మార్కెట్ లోకి ప్రవేశించిన 15 రోజుల్లోపే భారీ ఆఫర్లతో తగ్గింపు ధరలు ప్రకటించింది. ప్రస్తుతం రూ.49,900కి లభిస్తోంది. అంటే ఏకంగా రూ.20,000 తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.

DID YOU
KNOW
?
నథింగ్ ఫోన్ 3లో ఫ్లాగ్‌షిప్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్
నథింగ్ ఫోన్ 3 లో 50 MP ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒక ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్, టెలిఫోటో పెరిస్కోప్ కెమెరాలు ఉన్నాయి. అన్ని కెమెరాలతో 4K 60fps తో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఫ్రంట్ లో కూడా 50 MP కెమెరా వుంది.
25
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3పై భారీ ఆఫర్లు
Image Credit : Nothing India | X

ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3పై భారీ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ ఈ డిస్కౌంట్‌ను బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లతో అందిస్తోంది. ప్రస్తుతం 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. అయితే, ICICI లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ.10,000 తక్కువగా పొందవచ్చు.

అలాగే, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది. మీరు మార్చే ఫోన్ మోడల్, దాని పని స్థితిని బట్టి, ఎక్స్‌చేంజ్ ధర రూ. 69,500 వరకు ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు నథింగ్ ఫోన్ 2ఏ మోడల్‌ను పర్‌ఫెక్ట్ కండిషన్‌లో ఎక్స్‌చేంజ్ చేస్తే మొత్తం రూ.19,100 తగ్గింపు పొందవచ్చు. ఇలా చేస్తే నథింగ్ ఫోన్ 3 5జీ ఫైనల్ ధర కేవలం రూ. 49,900 మాత్రమే. ఈ ధరకు ఇది బెస్ట్ డీల్ అవుతుంది.

Related Articles

Related image1
Asia Cup 2025 full schedule: ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?
Related image2
IND vs PAK: ఆసియా కప్ 2025 కి ముహూర్తం ఫిక్స్.. ముచ్చటగా మూడు సార్లు తలపడనున్న భారత్-పాకిస్తాన్
35
నథింగ్ ఫోన్ 3 5G ప్రత్యేకతలు ఏమిటి?
Image Credit : Nothing/X

నథింగ్ ఫోన్ 3 5G ప్రత్యేకతలు ఏమిటి?

నథింగ్ ఫోన్ 3 5G ఈ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్. స్మార్ట్‌ఫోన్‌ల‌లో ట్రాన్స్పరెంట్ డిజైన్ తో న‌థింగ్ త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ సంవత్సరం నథింగ్ కంపెనీ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను తొలగించి, గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనే కొత్త యానిమేటెడ్ డిజైన్‌ను పరిచయం చేసింది. ఇది వినియోగదారులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుంది.

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వ‌స్తోంది. గేమింగ్, కెమెరా విష‌యంలో అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. న‌థింగ్ ఫోన్ 3 5జీ 12GB నుండి 16GB వరకు RAM, 256GB నుండి 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ల‌తో ల‌భిస్తోంది.

45
నథింగ్ ఫోన్ 3 5G కెమెరా, డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్
Image Credit : Nothing | X

నథింగ్ ఫోన్ 3 5G కెమెరా, డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ 3 5G లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రతి కెమెరా 50MP సామర్థ్యం కలిగి ఉంటుంది. వాటిలో

  • 50MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా
  • 50MP అల్ట్రా వైడ్ కెమెరా
  • 50MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్, 60x డిజిటల్ జూమ్ కెమెరా)

ఈ ఫోన్ తో 4K@60fps వరకు వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 50MP సామర్థ్యంతో వుండ‌గా, 4K@60fps తో వీడియో రికార్డింగ్ చేయ‌వ‌చ్చు.

డిస్‌ప్లే విష‌యానికి వ‌స్తే న‌థింగ్ 3 5జీ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 1260x2800 పిక్సెల్ రిజల్యూషన్‌తో అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

55
నథింగ్ ఫోన్ 3 5G బ్యాటరీ సామర్థ్యం, ఇతర ఫీచర్లు
Image Credit : @Gadgetsdata | x

నథింగ్ ఫోన్ 3 5G బ్యాటరీ సామర్థ్యం, ఇతర ఫీచర్లు

నథింగ్ ఫోన్ 3 5G లో 5150mAh బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ (వర్షన్ 4.0) కు స‌పోర్టు చేస్తుంది. USB టైప్-C పోర్ట్ ను క‌లిగి ఉంది. ఇది 5G డ్యూయల్ SIM (Nano + eSIM), డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది.

ఈ ఫోన్ కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం అని చెప్ప‌వ‌చ్చు. కొత్తగా విడుదలైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను 30% పైగా తగ్గింపుతో పొందేందుకు ఇది సరైన సమయం. బ్యాంక్ ఆఫర్‌లు, పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ బోనస్‌ వంటివి ఉపయోగించుకొని, అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా తక్కువ ధరలో పొందవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
Asia Cup 2025 full schedule: ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?
Recommended image2
IND vs PAK: ఆసియా కప్ 2025 కి ముహూర్తం ఫిక్స్.. ముచ్చటగా మూడు సార్లు తలపడనున్న భారత్-పాకిస్తాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved