MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • దేశం కోసం అంబానీ దంపతులు అన్ని వందల కోట్లు దానం చేశారా? TIME మ్యాగజైన్ దాతృత్వ జాబితాలో దక్కిన చోటు

దేశం కోసం అంబానీ దంపతులు అన్ని వందల కోట్లు దానం చేశారా? TIME మ్యాగజైన్ దాతృత్వ జాబితాలో దక్కిన చోటు

భారతదేశంలో అత్యంత ధనిక దంపతులైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు దేశం అభివృద్ధి కోసం వందల కోట్లు దానం ఇచ్చారు. వారి దాతృత్వాన్ని గుర్తించిన TIME మ్యాగజైన్ తొలిసారి విడుదల చేసిన TIME100 Philanthropy List 2024లో చోటు కల్పించింది. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 21 2025, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
TIME మ్యాగజైన్ లో చోటు..
Image Credit : X/@RIL_Updates

TIME మ్యాగజైన్ లో చోటు..

భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటైన అంబానీ కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా విరాళాలు ఇచ్చారు. 2024లో రూ.407 కోట్లు (సుమారు $48 మిలియన్లు) విరాళం ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద దాతలలో ఒకరిగా నిలిచారు.

అందుకే TIME మ్యాగజైన్ తొలిసారి విడుదల చేసిన TIME100 Philanthropy List 2024లో అంబానీలు ప్రపంచానికి మార్పు తీసుకొచ్చే వ్యక్తులుగా గుర్తింపు పొందారు.

25
రూ.407 కోట్ల విరాళాలు
Image Credit : X twitter

రూ.407 కోట్ల విరాళాలు

2024లో ముఖేష్, నీతా అంబానీలు రూ.407 కోట్లు (సుమారు $48 మిలియన్లు) విరాళాల రూపంలో సమాజానికి అందించారు.

ఈ జాబితాలో స్థానం దక్కడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారికి మాత్రమే TIME మ్యాగజైన్ లో చోటు దక్కదు. వాటిని ఆ దాతలు సమాజానికి ఎంతలా ఉపయోగించారన్న విషయాన్ని కూడా పరిశీలించి సరైన వ్యక్తులైతేనే జాబితాలో చోటు ఇస్తారు.

Related Articles

Related image1
7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
Related image2
Business Idea: రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల ఆదాయం.. సీజన్‌తో సంబంధమే లేదు
35
విరాళాలు ఎందుకు?
Image Credit : Twitter

విరాళాలు ఎందుకు?

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం, పెద్ద ఆరోగ్య, విద్యా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశాభివృద్ధికి ముఖేష్, నీతా అంబానీ దంపతులు కృషి చేశారు. అంతేకాకుండా వ్యవసాయం, మహిళా ఉపాధి, నీటి సంరక్షణ, పాఠశాల మౌలిక సదుపాయాలు, కంటి సంరక్షణ, ఆసుపత్రుల నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా లక్షలాది మంది భారతీయులు ప్రయోజనం పొందారు.

45
క్రీడాకారులకు ప్రోత్సాహం
Image Credit : Getty

క్రీడాకారులకు ప్రోత్సాహం

నీతా అంబానీ క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ క్రీడా మిషన్ ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులకు శిక్షణ ఇప్పించారు. మహిళల క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆధునిక శిక్షణా పద్ధతులు, సైంటిఫిక్ ఫిట్‌నెస్ సెంటర్లు స్థాపించి యువతను ప్రోత్సహించారు.

నీతా అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక క్రీడా సైన్స్ సౌకర్యాలను అందించడం ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులను, ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించింది.

55
భారతీయులకు చేయూత
Image Credit : Getty

భారతీయులకు చేయూత

సుమారు 110 బిలియన్ల డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. అంబానీ కుటుంబం వారి ఆదాయంలోనే ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చి సాధారణ భారతీయుల జీవితాల్లో ప్రత్యక్ష మార్పును తీసుకొచ్చారు. ఆసుపత్రుల నిర్మాణం నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందించడం వరకు వారి దాతృత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారత దేశం
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
Recommended image2
Business Idea: రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల ఆదాయం.. సీజన్‌తో సంబంధమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved