Best Electric Scooter: రూ.35 వేలకే 60 కి.మీ. ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదిగో!
Best Electric Scooter: మీరు తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే మంత్ర కంపెనీ కేవలం రూ.35 వేలకే 60 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. వివిధ మోడళ్లలో లభిస్తున్న ఈ స్కూటర్ ఇతర ఫీచర్స్ తెలుసుకుందాం రండి.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే మంత్ర కంపెనీ వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్స్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. కేవలం 5,000 రూపాయల డౌన్ పేమెంట్ తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. మంత్ర వివిధ బడ్జెట్లలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక స్కూటర్లను అందిస్తోంది. అవేంటో చూద్దాం.
మంత్ర కంపెనీ పలు మోడళ్లను అందిస్తోంది. నాన్-RTO కేటగిరీలో బేస్ మోడల్ ధర కేవలం రూ.35,000. ఈ స్కూటర్ 60 కి.మీ రేంజ్ వరకు పరుగులు తీస్తుంది.
ఇదే మోడల్ స్కూటర్ డ్యూయల్-బ్యాటరీ వేరియంట్ మీకు రూ. 40,000 కు లభిస్తుంది.
వేపర్ గ్రిల్ మోడల్ అయితే రూ.56,000 కు లభిస్తుంది. ఇది ఒక్క ఛార్జ్ తో ఏకంగా 80 కి.మీ ప్రయాణించగలదు.
మంత్ర కంపెనీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ.64,000 ధర కలిగిన B9 వేపర్ న్యూ మోడల్ జెల్, లిథియం బ్యాటరీలను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటో-లాకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. అందువల్ల ఈ స్కూటర్ చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఇందులో రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
రూ. 35,000లకు లభించే బేస్ మోడల్ స్కూటర్ 60 వోల్ట్ సిస్టమ్ పై పనిచేస్తుంది. కస్టమర్లు కేవలం రూ.5,000 నుండి రూ.10,000 వరకు డౌన్ పేమెంట్ కడితే చాలు ఈ స్కూటర్ ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. అంతేకాకుండా మంత్ర కంపెనీ ఈజీ ఇన్స్టాల్మెంట్ ప్లాన్ లను కూడా అందిస్తోంది.
మంత్ర కంపెనీ అందిస్తున్న ఈ స్కూటర్లను మీరు కొనుగోలు చేసే ముందు ఉచిత టెస్ట్ రైడ్ చేయవచ్చు. అంతేకాకుండా 32 అంగుళాల LED TV వంటి బహుమతులు కూడా కంపెనీ అందిస్తోంది.