MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Reliance Jio : కేవలం రూ.100 రీచార్జ్ తో రూ.299 ప్లాన్ బెనిఫిట్స్ పొందండిలా

Reliance Jio : కేవలం రూ.100 రీచార్జ్ తో రూ.299 ప్లాన్ బెనిఫిట్స్ పొందండిలా

రిలయన్స్ జియో మరో సూపర్ రీచార్జ్ ప్లాన్ తో ముందుకు వచ్చింది. కేవలం రూ.100కే రూ.299 ప్లాన్ లో అందించే సేవలు కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం చదవండి.

1 Min read
Author : Arun Kumar P
Published : May 17 2025, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Reliance Jio

Reliance Jio

టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియోది సక్సెస్ ఫుల్ జర్నీ. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన ఈ టెలికాం దిగ్గజం సరసమైన ధరలకే అత్యుత్తమ సేవలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది జియో. అందుకే జియో దేశవ్యాప్తంగా 49 కోట్లకు పైగా వినియోగదారుల నమ్మకాన్ని పొందగలిగింది.

ఇతర ప్రైవేట్, ప్రభుత్వ టెలికాం కంపనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ నుండి తీవ్ర పోటీని తట్టుకుని మరీ మార్కెట్ రారాజుగా నిలిచింది. జియో సక్సెస్ సీక్రెట్ తక్కువ ధర ప్లాన్‌లతో వినియోగదారులను మెరుగైన సేవలు అందించడమే.

ఇలా తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది జియో. ఆ ప్లాన్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

 

24
Jio Recharge Plan

Jio Recharge Plan

జియో సూపర్ రీచార్జ్ ప్లాన్ : 

వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో ఇప్పుడు రూ.100 ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది ఏకంగా రూ.299 విలువైన రీచార్జ్ ప్లాన్ లో అందించే ఓటిటి ప్రయోజనాలను అందిస్తోంది.

 ఈ ప్లాన్ మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను చూసేవారికి, ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన బడ్జెట్ ప్లాన్ కోరుకునే వారి కోసం రూపొందించబడింది.

 

Related Articles

Related image1
ముఖేష్ అంబానీ, ట్రంప్, ఖతార్ ఎమిర్ భేటీ
Related image2
అతిపెద్ద విదేశీ లోన్‌ డీల్ కుదుర్చుకున్న రిలయన్స్
34
Jio Rs 100 Plan

Jio Rs 100 Plan

రూ.100 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటా వస్తుంది. అలాగే 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను లభిస్తుంది. OTT ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లకు ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఐపిఎల్ చూడాలనుకునే వారికి ఇది సరైన ప్లాన్.

44
Jio

Jio

ఈ రూ.100 ప్లాన్ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ రెండు ముఖ్యమైన షరతులు ఉన్నాయి. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి మీ జియో నంబర్‌లో యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండాలి.

రెండవది ఈ రూ.100 ప్లాన్ మీ సిమ్‌ను ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉంచదు - ఇది OTT యాక్సెస్, పరిమిత డేటా కోసం బూస్టర్/సెకండరీ ప్లాన్. అంటే ఈ ప్లాన్ సేవలు పొందాలంటే యాక్టివ్ ప్లాన్ ఉండాల్సిందే. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతీయ టెలికాం
జీవనశైలి
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
ముఖేష్ అంబానీ, ట్రంప్, ఖతార్ ఎమిర్ భేటీ
Recommended image2
అతిపెద్ద విదేశీ లోన్‌ డీల్ కుదుర్చుకున్న రిలయన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved