MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • House Buying: భార్య లేదా తల్లి పేరుతో ఇల్లు కొంటే ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి

House Buying: భార్య లేదా తల్లి పేరుతో ఇల్లు కొంటే ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి

మన దేశంలో తల్లి లేదా భార్యా పేరు మీద ఆస్తి కొనుగోలు (House Buying) చేయడం వల్ల ఎంతో లాభం ఉంది. కొన్ని లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎన్నో రకాల ఛార్జీలు కూడా తగ్గుతాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 06 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎంత ఆదా అవుతుంది?
Image Credit : pexels

ఎంత ఆదా అవుతుంది?

మనదేశంలో భూమి, ఇల్లు కొనే వారి సంఖ్య ఎక్కువ. అయితే వాటిని ఎక్కువ మంది మగవారి పేరు మీదే కొనుగోలు చేసి పెట్టుకుంటారు. నిజానికి వాటిని భర్తల పేరు మీద కాకుండా భార్య పేరు మీద తల్లి పేరు మీద కొనడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ కోసం వసూలు చేసే రుసుము పురుషులకంటే మహిళలకు చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు ఒకటి నుంచి రెండు శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు రెండు కోట్ల విలువైన ఆస్తిని కొంటే స్టాంప్ డ్యూటీ మీకు నాలుగు లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.

25
హోమ్‌లోన్ తక్కువ వడ్డీకి
Image Credit : pexels

హోమ్‌లోన్ తక్కువ వడ్డీకి

ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. భార్య లేదా తల్లి పేరుతో ఆస్తి కొనుగోలు చేయడం వల్ల ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. అలాగే చట్టపరమైన ఎన్నో లాభాలను పొందవచ్చని వివరిస్తున్నారు. బ్యాంకులు కూడా మహిళలకు అది తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ సదుపాయాన్ని ఇస్తుంది. ఇది 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు ఉండవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా కూడా మహిళల కోసం వడ్డీ పై సబ్సిడీ ఉంటుంది. కొన్ని లక్షల వరకు మీరు ఈ పద్ధతిలో ఆదా చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Bangalore: రోడ్డుపై ఒంటరిగా వెళ్లిన పన్ను కట్టే రోజులు రాబోతున్నాయి, ఇలా అయితే బెంగళూరులో బతకడం కష్టమే
Related image2
Diwali Gold rate: దీపావళి నాటికి బంగారం ధర ఎంత అవుతుందో తెలుసా? ముందే ఎంతోకొంత కొనండి
35
జాయింట్ ఓనర్లు ఉంటేనే బెటర్
Image Credit : Pexels

జాయింట్ ఓనర్లు ఉంటేనే బెటర్

భర్త తన పేరు కూడా ఉండాలని కోరుకుంటే భార్యాభర్తలిద్దరూ జాయింట్ గా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హోమ్ లోన్ పై ఎంతో ప్రభావం కనిపిస్తుంది. తక్కువ పన్ను దీనిపై పడుతుంది. జాయింట్ గా కొనుగోలు చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా సెక్షన్ 80సి కింద పన్ను చెల్లింపులో లాభాలను పొందుతారు. జాయింట్ గా హోమ్ లోన్ తీసుకోవడం వల్ల వడ్డీ పై లాభం కూడా పెరుగుతుంది. సింగిల్ ఓనర్ కన్నా జాయింట్ ఓనర్లకు వడ్డీ మొత్తం ఎక్కువ తగ్గే అవకాశం ఉంది.

45
ఇదొక లాభం
Image Credit : Pexels

ఇదొక లాభం

భర్త వ్యాపారం చేసి నష్టపోతే అప్పుల వారు అతని పేరు మీద ఉన్న ఆస్తిని లాక్కోగలరు. కానీ అదే ఆస్తి భార్య పేరు మీద ఉంటే వారు ఏమీ చేయలేరు. అప్పు చేసిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తులను తీసుకునే హక్కు మాత్రమే వారికి ఉంటుంది. భార్య పేరు మీద ఉన్న భాగాన్ని వారు తీసుకోలేరు. కాబట్టి ఏదైనా ఆస్తిక కొనేటప్పుడు ఖచ్చితంగా మీ భార్య లేదా తల్లి పేరును కూడా జాయింట్ ఓనర్ గా పెట్టండి. దీనివల్ల మీకు రిస్కు తగ్గుతుంది.

55
లోన్ ఎవరు కడతారో వారిదే ఆస్తి
Image Credit : Pexels

లోన్ ఎవరు కడతారో వారిదే ఆస్తి

భార్య పేరు మీద ఆస్తి కొన్న తర్వాత ఆమె మీ నుంచి విడిపోయినా, లోన్ తిరిగి చెల్లించడానికి ఆమె ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోయినా.. మీకు ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే అద్దె భర్తకే దక్కుతుంది. దానికి ఆ ఆస్తికి లోన్ ఎవరు కడుతున్నారో ప్రూఫ్స్ దగ్గర పెట్టుకుంటే చాలు.. ఆ లోను తిరిగి కట్టే వారికే ఆ ప్రాపర్టీ పై అధికారాలు ఉంటాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Bangalore: రోడ్డుపై ఒంటరిగా వెళ్లిన పన్ను కట్టే రోజులు రాబోతున్నాయి, ఇలా అయితే బెంగళూరులో బతకడం కష్టమే
Recommended image2
Diwali Gold rate: దీపావళి నాటికి బంగారం ధర ఎంత అవుతుందో తెలుసా? ముందే ఎంతోకొంత కొనండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved