MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు

Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు

Gold Price: బంగారం ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. త‌గ్గ‌క‌పోతుందా అని అనుకున్న వారి ఆశ‌ల‌ను నిరాశ చేస్తూ పైపైకి దూసుకుపోతోంది. 2025లో చుక్క‌లు చూపించిన గోల్డ్ ప్రైజ్ వ‌చ్చే ఏడాది కూడా అదే దారిలో న‌డుస్తుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 21 2025, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2025లో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు
Image Credit : Getty

2025లో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

2025 ఏడాది బంగారం మార్కెట్‌కు చరిత్రాత్మకంగా మారింది. సంవత్సరం ఆరంభంలో రూ.78 వేల దగ్గర ఉన్న 10 గ్రాముల పసిడి ధర క్రమంగా పెరుగుతూ ఒక దశలో రూ.1.37 లక్షలు దాటింది. మధ్యలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించినా మొత్తం ఏడాది ట్రెండ్ మాత్రం పైకే సాగింది. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా ఎంచుకోవడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.

25
2026లో పసిడి రేటుపై అంతర్జాతీయ అంచనాలు
Image Credit : stockPhoto

2026లో పసిడి రేటుపై అంతర్జాతీయ అంచనాలు

వచ్చే ఏడాది బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ప్రస్తుత స్థాయిల నుంచి 15 నుంచి 30 శాతం వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. గోల్డ్‌మన్ శాక్స్ రిపోర్ట్ ప్రకారం 2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరవచ్చు. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే రూ.1.60 లక్షలు దాటే ఛాన్స్ కూడా ఉందని ఆ సంస్థ చెబుతోంది.

Related Articles

Related image1
Zodiac sign: వచ్చే వారం ఈ 4 రాశుల వారికి ల‌క్కీ కాలం.. అప్పుల‌న్నీ తీరిపోతాయి. కానీ..
Related image2
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
35
బంగారం ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణాలు.?
Image Credit : Getty

బంగారం ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణాలు.?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అమెరికా టారిఫ్ విధానాలు, వాణిజ్య యుద్ధాల భయం పెట్టుబడిదారులను స్టాక్ మార్కెట్ల నుంచి దూరం చేస్తున్నాయి. ఈ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. అదే విధంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు కూడా బంగారానికి అనుకూలంగా మారాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో పసిడి విలువ 60 శాతం పైగా పెరిగింది.

45
బంగారం ధరలు ఎందుకు ఆగట్లేదు?
Image Credit : Getty

బంగారం ధరలు ఎందుకు ఆగట్లేదు?

పెళ్లిళ్ల సీజన్ ఒక్కటే బంగారం ధర పెరుగుదలకు కారణం కాదు. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ తగ్గుతుండటం ప్రజలను బంగారం వైపు నడిపిస్తోంది. దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక భద్రతపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇదే సమయంలో సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు భారీ అప్పుల్లో కూరుకుపోవడం కూడా పసిడి డిమాండ్‌ను మరింత పెంచుతోంది.

55
పెట్టుబడిదారులకు లాభం.. కొనుగోలుదారులకు భారం
Image Credit : Getty

పెట్టుబడిదారులకు లాభం.. కొనుగోలుదారులకు భారం

ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారికి ఈ ధరల పెరుగుదల పెద్ద లాభంగా మారుతోంది. గోల్డ్ ఒక ఆభరణం మాత్రమే కాదు, ఆర్థిక అనిశ్చితి సమయంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. రాబర్ట్ కియోసాకి వంటి ఆర్థిక విశ్లేషకులు కూడా గోల్డ్ పెట్టుబడిని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఆభరణాల కోసం బంగారం కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఈ ధరలు తీవ్ర భారంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పసిడి సామాన్యులకు అందని స్థాయికి చేరే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
Zodiac sign: వచ్చే వారం ఈ 4 రాశుల వారికి ల‌క్కీ కాలం.. అప్పుల‌న్నీ తీరిపోతాయి. కానీ..
Recommended image2
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved