MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price: ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌.. ఎందుకిలా.? ఇంకా త‌గ్గ‌నుందా.?

Gold Price: ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌.. ఎందుకిలా.? ఇంకా త‌గ్గ‌నుందా.?

బంగారం ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రూ. ల‌క్ష దాటేసి ప‌రుగులు పెట్టిన ప‌సిడి ప్ర‌స్తుతం శాంతించింది. గ‌డిచిన కొన్ని రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. తాజాగా సోమ‌వారం కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 30 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు
Image Credit : AI Meta

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 97,410గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,300 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* ఇక ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 97,260, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 89,150గా ఉంది.

* చెన్నైలో 10 గ్రాముల 25 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 97,260కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,150 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* బెంగ‌ళూరు విష‌యానికొస్తే ఇక్క‌డ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 97,260గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,150 వ‌ద్ద కొన‌సాగుతోంది.

26
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?
Image Credit : Asianet News

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

* హైద‌రాబాద్‌లోనూ బంగారం ధ‌ర‌లో త‌గ్గుద‌ల క‌నిపించింది. ఇక్క‌డ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 97,260గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,150 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విజ‌య‌వాడ‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 97,260కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,150గా ఉంది.

* విశాఖ‌ప‌ట్నంలో 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 97,260కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,150గా ఉంది.

Related Articles

Related image1
EPFO: ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ అవుతోన్న వడ్డీ.. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా.?
Related image2
Fact: వ‌ర్షం ప‌డే ముందే ఉరుములు, మెరుపులు ఎందుకు వ‌స్తాయి.? అస‌లు లాజిక్ ఏంటో తెలుసా
36
వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?
Image Credit : Pinterest

వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

వెండి ధ‌ర‌లో కూడా త‌గ్గుద‌ల క‌నిపించింది. కిలో వెండిపై రూ. 100 వ‌ర‌కు త‌గ్గింది. ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌క‌తా, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో కిలో వెండి ధ‌ర రూ. 1,07,700 వ‌ద్ద కొన‌సాగుతోంది. కాగా హైద‌రాబాద్‌, చెన్నై, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో కిలో వెండి ధ‌ర రూ. 1,17,700గా ఉంది.

46
బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌గ్గుతున్నాయి.?
Image Credit : ChatGpt

బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌గ్గుతున్నాయి.?

మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల బంగారం, వెండి ధరల్లో వచ్చిన మార్పున‌కు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడమే అని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలు తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు ‘రిస్క్ ప్రీమియం’ను తగ్గించారు. ఫలితంగా బంగారం ఒక నెలలో కనిష్ట స్థాయికి చేరగా, వెండి కూడా అదే దారిలో పతనమైంది.

56
ఫెడ్ వడ్డీ రేట్లపై ఆశలు తగ్గిపోవడం కూడా
Image Credit : freepik

ఫెడ్ వడ్డీ రేట్లపై ఆశలు తగ్గిపోవడం కూడా

అమెరికా ఫెడ్ రిజర్వ్ తీరుపై పెట్టుబడిదారులు తమ అంచనాలను పునఃసమీక్షిస్తున్నారు. వడ్డీ రేట్ల తగ్గుదలపై ఆశలు గతంలో పోలిస్తే తగ్గిపోవడంతో బంగారంపై ఒత్తిడి పెరిగిందని రాహుల్ వివరించారు. ఫెడ్ త్వరలో రేట్లు తగ్గించ‌నుంద‌న్న భావ‌న కూడా బంగారం ధ‌ర‌పై ప్ర‌భావం చూపింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

66
బంగారం ధ‌ర ఇంకా త‌గ్గ‌నుందా.?
Image Credit : AI/freepik

బంగారం ధ‌ర ఇంకా త‌గ్గ‌నుందా.?

బంగారం ధ‌ర‌లు ఇంకా త‌గ్గ‌నున్నాయా.? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అమెరికా డాల‌ర్ ప‌త‌నం కావ‌డం కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూడా బంగారం ధ‌ర‌లు మరింత త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
EPFO: ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ అవుతోన్న వడ్డీ.. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా.?
Recommended image2
Fact: వ‌ర్షం ప‌డే ముందే ఉరుములు, మెరుపులు ఎందుకు వ‌స్తాయి.? అస‌లు లాజిక్ ఏంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved