MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? ఇలా చేస్తే ఆడుతు పాడుతూ నెల‌కు రూ. 15 వేలు సంపాద‌న‌

Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? ఇలా చేస్తే ఆడుతు పాడుతూ నెల‌కు రూ. 15 వేలు సంపాద‌న‌

Business Ideas: ఇళ్ల మేడపై ఉండే ఖాళీ ప్రదేశాన్ని సరిగ్గా ఉప‌యోగించుకుంటే మంచి ఆదాయం వచ్చే వ్యాపారంగా మార్చుకోవచ్చు. చిన్న స్థ‌లంలో కూడా టెర్రస్ వెజిటబుల్ ఫార్మింగ్ బిజినెస్ చేయొచ్చు. ఈ బిజినెస్ ఐడియాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 25 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెర్రస్ వెజిటబుల్ ఫార్మింగ్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

టెర్రస్ వెజిటబుల్ ఫార్మింగ్ అంటే ఏమిటి?

ఇంటి మేడపై డ్రమ్స్, గ్రో బ్యాగ్స్, ట్రేలు ఉపయోగించి కూరగాయలు పెంచే విధానాన్ని టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఇది చిన్న స్థాయిలో ప్రారంభించి బిజినెస్ స్థాయికి తీసుకెళ్లొచ్చు. ఇటీవ‌ల ఈ బిజినెస్ మోడ‌ల్‌కి డిమాండ్ పెరుగుతోంది. టమోటా, మిర్చి, బెండకాయ, పాలకూర, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వంటి వాటిని పెంచొచ్చు. నగరాల్లో ఆర్గానిక్ కూరగాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇదే ఈ బిజినెస్ బలంగా చెప్పొచ్చు.

25
మేడపై ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
Image Credit : Gemini AI

మేడపై ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి?

మొదట మేడపై నీటి లీకేజీ సమస్య లేకుండా చూసుకోవాలి. తర్వాత గ్రో బ్యాగ్స్ లేదా డ్రమ్స్, మంచి మట్టి, వర్మీ కంపోస్ట్, నీటి స్ప్రే సిస్టమ్, షేడ్ నెట్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. 100 గజాల మేడపై సుమారు 80–100 గ్రో బ్యాగ్స్ సులభంగా పెట్టొచ్చు. రోజుకు 1–2 గంటల పని సరిపోతుంది.

Related Articles

Related image1
Gold: అస‌లు బంగారం ఎలా పుట్టింది.? ఎందుకంతా విలువైందిగా మారింది.?
Related image2
Banana: మీరు కొన్న అర‌టి పండు.. కెమిక‌ల్స్‌తో పండించారా? న్యాచుర‌ల్‌వా? ఇలా తెలుసుకోండి
35
పెట్టుబడి ఎంత అవసరం?
Image Credit : Gemini AI

పెట్టుబడి ఎంత అవసరం?

ఈ బిజినెస్ పెద్ద పెట్టుబడి లేకుండా ప్రారంభించొచ్చు. అంచనా ఖర్చులు ఇలా ఉంటాయి.

గ్రో బ్యాగ్స్, డ్రమ్స్ – ₹20,000

మట్టి, కంపోస్ట్ – ₹10,000

నీటి వ్యవస్థ, షేడ్ నెట్ – ₹10,000

విత్తనాలు, చిన్న పరికరాలు – ₹5,000

మొత్తం పెట్టుబడి: ₹40,000 – ₹50,000

ఇది ఒకసారి పెట్టే ఖర్చు. తర్వాత నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

45
లాభాలు ఎలా ఉంటాయి?
Image Credit : Gemini AI

లాభాలు ఎలా ఉంటాయి?

నెలకు వచ్చే ఆదాయం పంటలపై ఆధారపడి ఉంటుంది. సగటు అంచనా ప్ర‌కారం.. నెలకు కూరగాయల విక్రయం – రూ. 15,000 నుంచి రూ. 25,000 జ‌రిగింది అనుకుందాం. రెస్టారెంట్స్, అపార్ట్‌మెంట్స్‌కు నేరుగా అమ్మకం చేస్తే ఆదాయం ఇంకా పెరుగుతుంది. అన్ని ఖ‌ర్చులు పోయినా నెల‌కు నికర లాభం రూ. 10,000 నుంచి రూ. 18,000 వ‌ర‌కు ఆదాయం పొందొచ్చు. ఇది ఇంటి మేడపై చేసే సైడ్ బిజినెస్ అయినా మంచి ఆదాయం ఇస్తుంది.

55
ఈ బిజినెస్ ప్రత్యేకతలు, భవిష్యత్తు అవకాశాలు
Image Credit : Gemini AI

ఈ బిజినెస్ ప్రత్యేకతలు, భవిష్యత్తు అవకాశాలు

ఇంటి నుంచే వ్యాపారం, అదనపు అద్దె అవసరం లేదు అలాగే మహిళలు, రిటైర్డ్ వ్యక్తులకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. స‌మ‌యం గ‌డ‌వ‌డంతో పాటు ఆదాయం పొందొచ్చు. ఆర్గానిక్ బ్రాండ్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.

తర్వాతి దశలో ఆర్గానిక్ వెజిటబుల్ హోమ్ డెలివరీ చేయొచ్చు. టెర్రస్ గార్డెనింగ్ ట్రైనింగ్ క్లాసులు చెప్పొచ్చు. ఈ విధంగా చిన్న మేడ నుంచే పెద్ద బిజినెస్‌గా మార్చుకోవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఈ వ్యాపారాన్ని మొద‌లు పెట్టే ముందు లాభ‌న‌ష్టాల గురించి స్ప‌ష్టంగా తెలియాలంటే అంత‌కుముందు ఈ రంగంలో అనుభ‌వం ఉన్న వారిని నేరుగా సంప్ర‌దిస్తే మ‌రీ మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Gold: అస‌లు బంగారం ఎలా పుట్టింది.? ఎందుకంతా విలువైందిగా మారింది.?
Recommended image2
Banana: మీరు కొన్న అర‌టి పండు.. కెమిక‌ల్స్‌తో పండించారా? న్యాచుర‌ల్‌వా? ఇలా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved