MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మ‌తిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బ‌లాదూర్ అంటారు

Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మ‌తిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బ‌లాదూర్ అంటారు

Business Idea: వ్యాపారం చేయాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. అయితే స‌రైన అవ‌గాహ‌న లేకో, న‌ష్టాలు వ‌స్తాయ‌ని భ‌య‌పడో వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ స‌రికొత్త‌గా ఆలోచిస్తే మంచి లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 20 2025, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వచ్ఛతకు పెరుగుతోన్న డిమాండ్
Image Credit : Generated by google gemini AI

స్వచ్ఛతకు పెరుగుతోన్న డిమాండ్

ఇప్పటి మార్కెట్‌లో కల్తీ సమస్య పెద్దగా మారింది. నిత్యం వాడే ఆహార పదార్థాలపైనా నమ్మకం తగ్గుతోంది. తినే వస్తువుల్లో కల్తీ ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ప్రజలు స్వచ్ఛమైన ఆహారాన్ని వెతుకుతున్నారు. ఇంట్లో తయారయ్యే పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితి చిన్న స్థాయి వ్యాపారాలకు మంచి అవకాశంగా మారింది. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే నష్టం లేకుండా ఆదాయం వచ్చే ఒక మార్గం ఇప్పుడు చూద్దాం.

25
ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారం
Image Credit : Getty

ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారం

నెయ్యి అనేది దాదాపు ప్రతి ఇంట్లో వాడే ఆహార పదార్థం. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు నెయ్యిని క్రమం తప్పకుండా ఇస్తుంటారు. స్వచ్ఛమైన నెయ్యికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఇంట్లోనే తయారయ్యే నెయ్యిపై వినియోగదారులు ఎక్కువ నమ్మకం చూపుతున్నారు. అందుకే ఇంటి స్థాయిలోనే నెయ్యి తయారీ ప్రారంభిస్తే నెలకు వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. దీనికి పెద్ద షాప్ కూడా అవసరం లేదు.

Related Articles

Related image1
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
Related image2
Numerology: ఈ తేదీలో పుట్టిన వారికి 2026లో కీల‌క మ‌లుపు.. ఓర్పుతో ఉండాల్సిన స‌మ‌యం
35
నెయ్యి తయారీకి అవసరమైన సామగ్రి
Image Credit : AI Meta

నెయ్యి తయారీకి అవసరమైన సామగ్రి

ఈ వ్యాపారం మొదలు పెట్టేందుకు భారీ పెట్టుబడి అవసరం ఉండదు.

* క్రీమ్ సెపరేటర్ మిషిన్ ఒకటి

* ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉండే పాలు

* గ్యాస్ స్టౌవ్ లేదా ఇండక్షన్

* నెయ్యి నిల్వ చేసేందుకు స్టీల్ పాత్రలు

* ప్యాకింగ్ కోసం డబ్బాలు లేదా క‌వ‌ర్లు.

క్రీమ్ సెపరేటర్ మిషిన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా దొరుకుతున్నాయి. చేతితో తిప్పే మోడల్స్ తక్కువ ధరకు లభిస్తాయి. పాలు నేరుగా పాడి రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది.

45
నెయ్యి తయారీ ప్రక్రియ
Image Credit : AI Meta

నెయ్యి తయారీ ప్రక్రియ

మొదట పాలను క్రీమ్ సెపరేటర్ మిషిన్‌లో పోయాలి. మిషిన్ ఆన్ చేసిన తర్వాత ఒక వైపు నుంచి క్రీమ్ బయటకు వస్తుంది. మరో వైపు నుంచి తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు వస్తాయి. సేకరించిన క్రీమ్‌ను మెల్లగా వేడి చేస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యి చల్లారిన తర్వాత డబ్బాల్లో నింపి అమ్మకానికి సిద్ధం చేయొచ్చు. క్రీమ్ తీసిన పాలను టీ దుకాణాలకు లేదా స్వీట్ షాపులకు విక్రయించవచ్చు. ఇలా ఒక్క రూపాయి కూడా వృథా కాదు.

55
లాభాల ఎలా ఉంటాయంటే.?
Image Credit : AI Meta

లాభాల ఎలా ఉంటాయంటే.?

లాభాల విషయానికి వస్తే ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగా చెప్పొచ్చు. సుమారు 18 లీటర్ల పాలతో ఒక కిలో నెయ్యి వస్తుంది. ఉదాహరణకు 90 లీటర్ల పాలు తీసుకుంటే దాదాపు 5 కిలోల నెయ్యి తయారవుతుంది. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యిని కిలోకు రూ. 650 వరకు విక్రయించవచ్చు. అలా చూసుకుంటే నెయ్యి ద్వారా సుమారు రూ. 3250 ఆదాయం వస్తుంది. మిగిలిన 70 లీటర్ల పాలను లీటర్‌కు రూ. 38 చొప్పున అమ్మినా మరో రూ. 2600 వస్తాయి. మొత్తంగా ఒక బ్యాచ్‌తో సుమారు రూ. 5800 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని ఖర్చులు పోయినా భారీగా లాభం ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆర్డ‌ర్ల‌ను స్వీక‌రించి నేరుగా ఇంటికి హోం డెలివ‌రీ కూడా చేయొచ్చు. ఇక స్థానికంగా ఉన్న స్వీట్ షాప్స్‌, హోట‌ల్స్‌కు కూడా స‌ర‌ఫ‌రా చేయొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
Recommended image2
Numerology: ఈ తేదీలో పుట్టిన వారికి 2026లో కీల‌క మ‌లుపు.. ఓర్పుతో ఉండాల్సిన స‌మ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved