MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గించిన బీఎస్ఎన్ఎల్

BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గించిన బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఎప్పుడూ తక్కువకే లాభదాయకమైన రీఛార్జ్ ప్లాన్లు అందిస్తుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు ముఖ్యమైన, పాపులర్ ప్లాన్ల రీఛార్జ్ ధరలు తగ్గించింది. అవేంటి? ఎంత ధర తగ్గింది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 22 2025, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీయే..
Image Credit : X

ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీయే..

ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే చాలా చౌకగా ఉంటాయి. అందుకే చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ లోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ రెండు ముఖ్యమైన ప్లాన్‌ల ధరలు తగ్గించింది. 

25
BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్
Image Credit : Getty

BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్లాన్‌ ఇప్పుడు రూ.947 కే లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రూ.50 తగ్గింపు లభిస్తుంది. ఈ ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీతో పాటు ఎక్కువ డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే దీని నెలవారీ ఖర్చు కేవలం రూ.178 మాత్రమే. అంటే 5 నెలల పాటు రీఛార్జ్ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Related Articles

Related image1
మీ ఏరియాలో BSNL 4G సిగ్నల్ ఉందా? ఇలా ఈజీగా చెక్ చేయండి
Related image2
Airtel నెట్‌వర్క్‌లో ఇంత మంచి ఆఫర్లు ఉన్నాయా?
35
ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా
Image Credit : Getty

ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా

రూ.947 ప్లాన్ మొత్తం 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మీరు ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లకు కాల్ చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీనితో పాటు ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా పొందవచ్చు. ఎక్కువ ఇంటర్నెట్, కాల్‌లను ఉపయోగించే వినియోగదారులకు ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్. 

45
BSNL రూ.569 రీఛార్జ్ ప్లాన్
Image Credit : Google

BSNL రూ.569 రీఛార్జ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్ ధర కూడా ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.569కే లభిస్తుంది. అంటే రూ.30 తగ్గింది. ఈ ప్లాన్ మీకు కాస్త తక్కువ వ్యాలిడిటీ తో వస్తున్నా మీకు ఎక్కువ డేటా లభిస్తుంది. డేటా ఎక్కువ కావాలనుకున్న వినియోగదారులకు ఇది బెస్ట్ ప్లాన్. ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.

55
 ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటా
Image Credit : google

ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటా

బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్‌ రీఛార్జ్ చేసుకుంటే మీరు ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటాను పొందుతారు. దీనితో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ గా కాల్స్ చేయొచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పంపవచ్చు. రోజుకు 2GB డేటా సరిపోని వారికి ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ టెలికాం
ఏషియానెట్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
మీ ఏరియాలో BSNL 4G సిగ్నల్ ఉందా? ఇలా ఈజీగా చెక్ చేయండి
Recommended image2
Airtel నెట్‌వర్క్‌లో ఇంత మంచి ఆఫర్లు ఉన్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved