- Home
- Business
- EV Scooters: కాలేజీకి వెళ్లడానికి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, ఎక్కువ మైలేజ్ కూడా..
EV Scooters: కాలేజీకి వెళ్లడానికి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, ఎక్కువ మైలేజ్ కూడా..
EV Scooters for College Students: మీ పిల్లలు కాలేజీకి వెళ్లడానికి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? బైక్ ల కంటే ఇవి చాలా బెస్ట్. ఒక్క ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు
పెట్రోల్ రేట్లు పెరుగుతుండటంతో కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారు. స్టైలిష్ డిజైన్లు, తక్కువ నిర్వహణ ఖర్చులు రోజువారీ ప్రయాణాలకు అనువైన ఎంపికగా ఉండటం కూడా మరో కారణం. ఈ ఏడాది అనేక EV కంపెనీలు స్మార్ట్ టెక్నాలజీ, మంచి బ్యాటరీ కెపాసిటీ, తక్కువ ధరలను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం విడుదల చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఓలా S1X+
రోజు కాలేజీకి వెళ్లి రావడానికి ఓలా S1X+ చాలా బాగుంటుంది. ఇది దాదాపు రూ.90,000 (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్ లో లభిస్తోంది. ఈ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కి.మీ.ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 90 కి.మీ. వేగంతో దూసుకుపోగలదు.
ఇది లేటెస్ట్ డిజిటల్ డాష్‌బోర్డ్, డిఫరెంట్ రైడింగ్ మోడ్‌లు, వేగవంతమైన ఛార్జింగ్ కెపాసిటీని కలిగి ఉంది. స్టైలిష్ లుక్ తో పాటు, ఎక్కువ దూరం ప్రయాణించే కెపాసిటీ ఈ స్కూటర్ ను స్టూడెంట్స్ కి ఫేవరేట్ గా మార్చింది.
టీవీఎస్ ఐక్యూబ్
టీవీఎస్ ఐక్యూబ్ ఒక్క ఛార్జ్ తో దాదాపు 85 కి.మీ.ల వరకు ఆగకుండా ప్రయాణించగలదు. అంతేకాకుండా గంటకు 78 కి.మీ.ల వేగంతో దూసుకుపోతుంది. ఇది నగరాల్లో ప్రయాణించడానికి, తక్కువ దూరం వెళ్లడానికి అనువైనది.
టీవీఎస్ బ్రాండ్ క్వాలిటీ, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ వల్ల ఇది స్టూడెంట్స్ కి ఫేవరేట్ గా మారింది. దీని మెయింటనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతానికి రూ.95,000 ధరతో ఇది మార్కెట్ లో లభిస్తోంది.
ఏథర్ 450X
2025లో విడుదలైన ఏథర్ 450X ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారింది. ఇది ఎవ్వరైనా నడపడానికి వీలుగా రూపొందించారు. అందుకే స్టూడెంట్స్ కి కూడా అనుకూలంగా ఉంది.
ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీ.ల వరకు ప్రయాణిస్తుంది. విశాలమైన, సౌకర్యవంతమైన సీటు విద్యార్థులకు బాగా నచ్చుతుంది. బ్యాగులను తీసుకెళ్లడానికి, స్నేహితులతో కలిసి ప్రయాణించడానికి బాగుంటుంది.
ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ బేస్డ్ కంట్రోల్స్ వంటి స్మార్ట్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. దీని ధర దాదాపు రూ.1 లక్ష.
బజాజ్ చేతక్
బజాజ్ బ్రాండ్ నుంచి వచ్చిన చేతక్ నూతన హంగులతో తిరిగి మార్కెట్ లోకి వచ్చింది. ఈ కొత్త డిజైన్ దాదాపు ప్రీమియం మెటల్ బాడీతో తయారైంది. ఇది ఒక్క ఛార్జ్ తో 113 కి.మీ.ల ప్రయాణిస్తుంది.
దీని రెట్రో లుక్ కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదే ఈ స్కూటర్ స్పెషాలిటీ. దీని ధర ప్రస్తుత మార్కెట్ లో రూ.1 లక్ష కంటే తక్కువ ధరతో లభిస్తోంది. క్లాసిక్ అందాన్ని కోరుకునే విద్యార్థులకు ఈ స్కూటర్ నచ్చుతుంది.
సింపుల్ వన్
మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన సింపుల్ వన్ బడ్జెట్ EV విభాగంలో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఇది ఒక్క ఛార్జ్ తో 151 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్. సింపుల్ లుక్ ఉండాలనుకొనే స్టూడెంట్స్ కి ఇది కరెక్ట్ ఛాయిస్. దీని ధర రూ.1 లక్ష కంటే తక్కువగా ఉంది.