MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లలకు పొరపాటున కూడా పెట్టకూడని ఫుడ్స్ ఏంటో తెలుసా?

పిల్లలకు పొరపాటున కూడా పెట్టకూడని ఫుడ్స్ ఏంటో తెలుసా?

పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ వారు ఇష్టంగా అడుగుతున్నారని మనం పెట్టే కొన్ని బయటి ఫుడ్స్ వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. నిపుణుల ప్రకారం పిల్లలకు పొరపాటున కూడా పెట్టకూడని కొన్ని ఆహారాలున్నాయి. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Nov 01 2025, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు
Image Credit : Freepik

చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు

చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు పిల్లలకు చాలా ప్రమాదకరం. చాక్లెట్లు, కేకులు, ఐస్‌క్రీములు పిల్లలకి ఎంత ఇష్టమో అంత హానికరం కూడా. వీటిలో ఉన్న అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ తర్వాత అలసట, చిరాకు, ఆగ్రహం కలిగిస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలు, బరువు పెరగడం, భవిష్యత్తులో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి చాక్లెట్లు లేదా స్వీట్లను పిల్లలకు ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది.

26
ప్యాకెట్ స్నాక్స్
Image Credit : Asianet News

ప్యాకెట్ స్నాక్స్

ప్యాకెట్ స్నాక్స్ కూడా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చిప్స్, కుర్కురే, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్, సోడియం, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. చిప్స్‌లో ఉన్న అధిక ఉప్పు , ఆయిల్ కారణంగా రక్తపోటు, చర్మ సమస్యలు రావచ్చు. అధిక రుచి మనసుని తృప్తి పరిచినా శరీరాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ రకమైన ఫుడ్‌ను పిల్లలకు పెట్టకపోవడమే మంచిది. 

Related Articles

Related image1
పిల్లలు చురుకుగా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?
Related image2
పిల్లల మనసు గెలవాలంటే అమ్మ ఎలా ఉండాలో తెలుసా?
36
సాఫ్ట్ డ్రింక్స్
Image Credit : our own

సాఫ్ట్ డ్రింక్స్

పిల్లల పుట్టిన రోజులు, పార్టీల్లో సాఫ్ట్ డ్రింక్స్ ని తరచుగా ఇస్తుంటారు. కానీ వీటిలో కెఫిన్, ఫాస్ఫారిక్ యాసిడ్, అధిక చక్కెర ఉంటాయి. ఇవి ఎముకల్లో కాల్షియాన్ని తగ్గిస్తాయి. దంత సమస్యలను కలిగిస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణం అవుతాయి. కొన్ని డ్రింక్స్ లో వాడే రంగులు పిల్లల్లో అలెర్జీలు లేదా హైపర్‌యాక్టివిటీని పెంచుతాయి. కాబట్టి పిల్లలకు నీళ్లు, తాజా పండ్ల రసాలు లేదా ఇంట్లో తయారుచేసిన బట్టర్‌మిల్క్ వంటివి ఇవ్వడం ఉత్తమం.

46
ప్రాసెస్డ్ ఫుడ్‌
Image Credit : Asianet News

ప్రాసెస్డ్ ఫుడ్‌

ఇన్‌స్టంట్ నూడిల్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌లో మోనోసోడియం గ్లుటమేట్, సోడియం, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిని తరచుగా తినడం వల్ల పిల్లల్లో అలసట, జీర్ణ సమస్యలు వస్తాయి. వీటికి బదులు వెజిటెబుల్ ఉప్మా, సేమియా ఉప్మా, లేదా సూప్ వంటి ఇంటి వంటకాలు ఉత్తమం.

56
ఫాస్ట్ ఫుడ్‌
Image Credit : freepik

ఫాస్ట్ ఫుడ్‌

పిజ్జా, బర్గర్, పాస్తా లాంటి ఆహారాలను పిల్లలు ఇష్టపడతారు. కానీ వాటిలో ఉండే మైదా, చీజ్, సాసెస్, ఓవర్ ఫ్రైడ్ ఆయిల్ వల్ల శరీరంలో కొవ్వు పెరిగి రక్తనాళాలకు నష్టం కలుగుతుంది. తరచుగా తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. విటమిన్ లోపం వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. 

66
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు
Image Credit : Pixabay

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

అధిక ఉప్పు ఉన్న ఆహారాలు కూడా పిల్లల ఆరోగ్యానికి హానికరమైనవి. పికిల్స్, పాప్‌కార్న్, చిప్స్ వంటివి తినడం వల్ల రక్తపోటు, డీహైడ్రేషన్, చర్మ సమస్యలు రావచ్చు. అలాగే సరిగ్గా ఉడకని గుడ్లు, పాశ్చరైజ్ కాని పాలు ఇవ్వకూడదు. వీటిలో సాల్మోనెల్లా అనే బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది. కాబట్టి పిల్లలకు ఎప్పుడు కాచి చల్లార్చిన పాలను, పూర్తిగా ఉడికించిన గుడ్లను మాత్రమే ఇవ్వాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Recommended image2
Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉందా? వంట-వార్పు కాదు,కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవి..!
Recommended image3
Raising Sons: మీకు అబ్బాయి ఉన్నాడా? చిన్నప్పటి నుండే నేర్పాల్సినవి ఇవే..
Related Stories
Recommended image1
పిల్లలు చురుకుగా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?
Recommended image2
పిల్లల మనసు గెలవాలంటే అమ్మ ఎలా ఉండాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved