MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Ambani Assets: అంబానీ ఇల్లుతో సహా ఆస్తులన్నీ జప్తు, చివరికి తూర్పుగోదావరిలో ఉన్న స్థిరాస్తులు కూడా

Ambani Assets: అంబానీ ఇల్లుతో సహా ఆస్తులన్నీ జప్తు, చివరికి తూర్పుగోదావరిలో ఉన్న స్థిరాస్తులు కూడా

Ambani Assets: అనిల్ అంబానీకి అతి పెద్ద కష్టం వచ్చింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అయిన అనిల్ కు చెందిన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఆస్తులు ఉన్నాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 04 2025, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనిల్ అంబానీ కష్టాలు
Image Credit : reliance group india

అనిల్ అంబానీ కష్టాలు

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆయనకు చెందిన ఆస్తులు అన్నిటినీ జప్తు చేసింది ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ మేరకు సోమవారం ప్రకటన కూడా చేసింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ చర్యలకు దిగినట్లు ఈడీ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు అనిల్ అంబానీ లేదా అతని గ్రూప్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.

24
కష్టాల్లో అనిల్ అంబానీ
Image Credit : reliance group india

కష్టాల్లో అనిల్ అంబానీ

అనిల్ అంబానీ కుటుంబం ప్రస్తుతం నివాసం ఉంటున్న ముంబైలోని ఇంటితో పాటు ఆయన గ్రూపుకు చెందిన ఎన్నో నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఈడీ. అతనికి హైదరాబాదులోని సోమాజిగూడులో కామస్ కాప్రి అపార్ట్మెంట్స్ లో రెండు లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని కూడా జప్తు చేయాల్సిన ఆస్తులు జాబితాలో పెట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. వాటిని కూడా అటాచ్ చేసింది. వీటితో పాటు ముంబై, నోయిడా, థానే, ఢిల్లీ, పూణే, చెన్నై, ఘజియాబాద్ లో ఉన్న స్థిరాస్తులను కూడా జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.

Related Articles

Related image1
Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి?
Related image2
Best Low Price cars: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ ఇచ్చే చవక కార్లు ఇవిగో, వీటిని కొనడం సులువు
34
అన్నీ ఆస్తులు జప్తు
Image Credit : reliance group india

అన్నీ ఆస్తులు జప్తు

ముంబైలో ఉన్న ధీరుభాయి అంబానీ నాలెడ్జ్ సిటీ 32 ఎకరాల్లో ఉంది. దీన్ని కూడా అటాచ్ చేసింది. దీని విలువ 4,462 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ జప్తు జరుగుతోంది. ఇప్పటివరకు అనిల్ అంబానీకి చెందిన 7,545 కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది.

44
ఎంత అప్పు తీసుకున్నారు?
Image Credit : reliance group india

ఎంత అప్పు తీసుకున్నారు?

రిలయన్స్ కమ్యూనికేషన్స్... దీన్నే ఆర్ కామ్ అంటారు. దీంతోపాటు సంబంధిత కంపెనీలు తీసుకున్న రుణాలు అన్నీ కూడా మోసపూరితమైనవేనని అధికారులు తేల్చారు. ఈ కంపెనీల పేరుతో రుణాలు తీసుకొని వాటిని ఇతర గ్రూపు కంపెనీలోకి మళ్లించినట్టు నిర్ధారణ అయింది. దాదాపు 13,600 కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణం రూపంలో తీసుకున్నారని ఈడీ చెబుతోంది. దీనిపై ఎప్పటినుంచో సోదాలు జరుగుతూనే ఉన్నాయి. హవాలా, నిదుల మళ్లింపు వంటి కేసుల్లో ప్రస్తుతం అనిల్ అంబానీ ఇరుక్కుపోయారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Recommended image2
ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ ఎప్పుడొస్తుంది.? ఈపీఎఫ్ఓ రూల్స్ ఏం చెబుతున్నాయ్..
Recommended image3
ప్రతీ నెలా రూ. 2 వేల SIPతో.. 10 ఏళ్లలో లక్షల్లో రాబడి.. లెక్కలు ఇవిగో..
Related Stories
Recommended image1
Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి?
Recommended image2
Best Low Price cars: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ ఇచ్చే చవక కార్లు ఇవిగో, వీటిని కొనడం సులువు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved