MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Best Scooters: తక్కువ ధరలో మంచి స్కూటర్ కొనాలంటే.. ఇవే బెస్ట్ ఆప్షన్!

Best Scooters: తక్కువ ధరలో మంచి స్కూటర్ కొనాలంటే.. ఇవే బెస్ట్ ఆప్షన్!

భారతదేశ మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్కూటర్లు వస్తూనే ఉంటాయి. వాటిలో తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు ఉన్న స్కూటర్లనే ఎక్కువమంది సెలెక్ట్ చేసుకుంటారు. అలా బడ్జెట్ లో దొరికే బెస్ట్ స్కూటర్లను ఒకసారి చూసేయండి

1 Min read
Author : Kavitha G
Published : Feb 25 2025, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశ మార్కెట్ లో ఏటా కొత్త ఫీచర్లతో టూవీలర్లు వస్తూనే ఉన్నాయి. తక్కువ ధర, బెస్ట్ మైలేజ్, మంచి కంఫర్ట్ కలిగిన స్కూటర్లను వినియోగదారులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. మార్కెట్ లో ఎన్ని ఉన్నా కొన్ని స్కూటర్లను మాత్రం ఏరికోరి కొనుక్కుంటూ ఉంటారు. కంపెనీలు సైతం పోటీ పడి మరీ వారి అవసరాలకు తగ్గట్టుగా కొత్త మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. అలా మంచి ఫీచర్లతో తక్కువ ధరలో దొరికే కొన్ని స్కూటర్లు మీకోసం. ఒకసారి చూసేయండి.

25
టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్

టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్

ఎక్కువమంది ఇష్టపడే స్కూటీల్లో టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ ముందు వరుసలో ఉంటుంది. ఇది చాలా తేలికైన, చిన్న స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 65,500 వరకు ఉంటుంది. ఇది 87.8cc ఇంజిన్‌తో వస్తుంది. సిటీలో తిరగడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈజీ ఎలక్ట్రిక్ స్టార్ట్, అలాయ్ వీల్స్, USB ఛార్జింగ్ పోర్ట్ దీని ప్రత్యేకతలు.

35
హీరో ప్లెజర్ ప్లస్

హీరో ప్లెజర్ ప్లస్

హీరో ప్లెజర్ ప్లస్.. స్టైలిష్ డిజైన్, స్మూత్ పెర్ఫార్మెన్స్ కి పేరు పొందింది. దీని ధర రూ. 71,200 నుంచి మొదలవుతుంది. ఇది 110.9cc ఇంజిన్‌తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, అలాయ్ వీల్స్, USB ఛార్జింగ్ పోర్ట్  లాంటి ఫీచర్లు ఉన్నాయి.

45
హోండా యాక్టివా 6G

హోండా యాక్టివా 6G

అత్యంత ప్రజాధరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన యాక్టివా 6G ధర 78,600. ఈ స్కూటీ 109.51cc ఇంజిన్‌తో మంచి మైలేజ్ ఇస్తుంది. అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఉండటం వల్ల ఇది సేఫ్టీగా ఉంటుంది.

55
టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్

తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వాళ్లకి టీవీఎస్ జూపిటర్ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 73,700 నుంచి మొదలవుతుంది. 113.3cc ఇంజిన్‌తో కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాయ్ వీల్స్ ఉన్నాయి.

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Wagon R: ఫిబ్రవరిలో బంపర్ ఆఫర్.. ఈ కారుపై ఏకంగా రూ.40,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనేయండి!
Recommended image2
Tesla : కేవలం రూ.6 లక్షలుంటే చాలు.. టెస్లా కారును మీ ఇంటికి పట్టుకెళ్లండి
Recommended image3
Mahindra Scorpio N : భారీ మార్పులతో స్కార్పియో వచ్చేస్తోంది.. ధర ఎంతో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved