MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ తేదీల్లో పుట్టినవారికి బద్ధకం ఎక్కువ.. ఏ పని సరిగ్గా చేయరు!

ఈ తేదీల్లో పుట్టినవారికి బద్ధకం ఎక్కువ.. ఏ పని సరిగ్గా చేయరు!

సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి తేదీ ఒక మూల సంఖ్యను సూచిస్తుంది. ప్రతి సంఖ్యకు ఒక గ్రహాధిపత్యం ఉంటుంది. ఆ గ్రహాల ప్రభావం ఆ తేదీల్లో పుట్టినవారిపై ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా లేజీగా ఉంటారు. ఏ పని సరిగ్గా చేయరు. పనులు వాయిదా వేస్తూనే ఉంటారు.

2 Min read
Author : Kavitha G
Published : Nov 22 2025, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Birth Date Numerology
Image Credit : Getty

Birth Date Numerology

జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రాల ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావాన్ని తెలుసుకోవచ్చు. గ్రహస్థితులు, జన్మ రాశి, అంకెల ప్రభావం వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని తేదీల్లో పుట్టినవారిలో సహజంగానే అలసత్వం, నిదాన స్వభావం, పనులను వాయిదా వేయడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తేదీలేంటో ఇక్కడ చూద్దాం.

24
మూలసంఖ్య 2
Image Credit : stockPhoto

మూలసంఖ్య 2

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 2. ఈ సంఖ్య చంద్రుని ప్రభావంలో ఉంటుంది. చంద్రుని స్వభావం ఊహాశక్తి, సున్నితత్వం, భావోద్వేగం. దానివల్ల ఈ తేదీల్లో పుట్టినవారు.. పని చేయడానికి ముందు ఎక్కువగా ఆలోచిస్తారు. ఏ పని ఆనందంగా చేయడానికి ముందుకురారు. ఇతరులతో పోలిస్తే.. వీరు చురుకుగా కనిపించకపోవచ్చు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, పనులను లేటుగా మొదలుపెట్టడం, చిన్న పనికి కూడా ఎక్కువ సమయం తీసుకోవడం వంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. 

Related Articles

Related image1
ఈ 5 నెలల్లో పుట్టినవారికి ఆత్మాభిమానం ఎక్కువ.. ఎవ్వరిముందు తలవంచరు!
Related image2
ఈ 5 రాశులవారు ఎవ్వరి మాట వినరు.. అన్నీ తమకే తెలుసు అనుకుంటారు!
34
మూలసంఖ్య 7
Image Credit : stockPhoto

మూలసంఖ్య 7

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 7. ఈ సంఖ్యపై కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు సాధారణంగా అంతర్ముఖులు, ఊహా ప్రపంచంలో ఎక్కువగా మునిగిపోయి ఉంటారు. వీరికి చురుకుదనం తక్కువ. క్రమశిక్షణతో పని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. చాలామందిలో నిదాన ధోరణి కనిపిస్తుంది. మొదట పని చేయడానికి నిరీక్షించడం, దైర్యం కూడబెట్టుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం, ఏ పని అయినా తొందరగా చేయాలనే ఆసక్తి లేకపోవడం వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. 

44
మూలసంఖ్య 6
Image Credit : stockPhoto

మూలసంఖ్య 6

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 6. ఈ మూల సంఖ్య శుక్రుడి ప్రభావంలో ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారు అందం, సౌకర్యం, సుఖం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సౌకర్యాలను ప్రేమించే ఈ స్వభావం కారణంగా శారీరక శ్రమ ఉన్న పనులకు వీరు దూరంగా ఉంటారు. మంచి ఆహారం, విశ్రాంతి, కళాత్మక వాతావరణం వంటి వాటిలో మునిగిపోయినప్పుడు పనులను వాయిదా వేయడం వీరికి అలవాటుగా మారుతుంది. అందువల్ల మూల సంఖ్య 6 కలిగిన వ్యక్తులు కూడా కాస్త లేజీగా కనిపిస్తారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Related Stories
Recommended image1
ఈ 5 నెలల్లో పుట్టినవారికి ఆత్మాభిమానం ఎక్కువ.. ఎవ్వరిముందు తలవంచరు!
Recommended image2
ఈ 5 రాశులవారు ఎవ్వరి మాట వినరు.. అన్నీ తమకే తెలుసు అనుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved