Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు ముఖం మీద కొట్టినట్లే మాట్లాడతారు..!
న్యూమరాలజీ ప్రకారం , కొన్ని తేదీల్లో జన్మించిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడరు. వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉంటారు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరు ఎప్పుడూ నువ్వుతూ అందరితోనూ స్నేహంగా ఉంటారు. కానీ, కొందరు మాత్రం అలా కాదు.. నిర్మొహమాటంగా ఉంటారు. ముందు ఒకలాగా, వెనక ఒకలాగా మాట్లాడరు. ఏదైనా సూటిగా మాట్లాడేస్తారు. చాలా బోల్డ్ గా ఉంటారు. తాము అనుకున్న విషయాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడరు.ఇలాంటివారిని చూస్తే చాలా మంది భయంగా ఉంటుంది. మరి, న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో తెలుసుకుందామా..
న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది.ఆ సంఖ్యలకు సంబంధించిన జన్మ తేదీలు మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా ధోరణి, జీవిత విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాగా, ఈ న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 5, 9, 14, 17, 22, 26 తేదీల్లో జన్మించిన వారు ఏదైనా ముఖం మీదే మాట్లాడేస్తారు. అందరిలా ముందు ఒకలా, వెనక మరోలా మాట్లాడే రకం కాదు.
ఏ నెలలో అయినా నెంబర్ 1 తేదీలో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడరు. వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
5, 26 తేదీలు: వీరికి తెలివితేటలు ఎక్కువ. వారు చురుకైన ఆలోచనలు, హాస్యం కలగలిపిన మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు.నిర్మొహమాటం లేకుండా మాట్లాడతారు.
9వ తేదీ: ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ, వీరు నిజాన్ని చెప్పడంలో వెనుకడుగు వేయరు. వారి మాటలు ఎప్పుడూ నిజమే అయినా, అవి అందరికీ నచ్చకపోవచ్చు.
14, 17 తేదీలు:ఈ తేదీల్లో జన్మించిన వారు ఇతరుల క్షేమాన్ని మొదటిగా చూసే స్వభావం వీరికి ఉంది. మాటల్లో నిజాయితీ ఉండాలనేది వీరి నమ్మకం.
22వ తేదీ: వీరు స్వచ్ఛతను, నిజాయితీని ఎక్కువగా విలువలుగా ఎంచుకుంటారు. తమకు ఏది నచ్చితే అదే చెబుతారు. ఇతరులను సంతోష పెట్టడానికి అబద్దాలు చెప్పడం లాంటి పనులు వీరు చేయరు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు.
నిజాయితీకి ధైర్యం అవసరం
ఈ వ్యక్తుల మాటల ధోరణి కొన్నిసార్లు తీవ్రమైనదిగా అనిపించవచ్చు. కానీ వారి ధైర్యం, నిజాయితీ ఎంతో మందిని ఆకర్షిస్తుంది. వాళ్లు మధురంగా మాట్లాడకపోయినా, నిజాన్ని చెబుతారు. వారి నిజాయితీనే అందరి ముందు వారిని ప్రత్యేకంగా చూపిస్తుంది.
నిజమైన వ్యక్తిత్వానికి అర్థం
ఈ స్వభావాన్ని కలవారి నుంచి మనం నేర్చుకోవలసింది ఏమంటే – మనలోని నిజమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడమే. నేరుగా మాట్లాడేవారిని అర్థం చేసుకుని గౌరవించడం ద్వారా మనం నిజాయితీని పెంపొందించినవారం అవుతాం.