Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు కోటీశ్వర్లు అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 అంటే.. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. వారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రావు.

మనం పుట్టిన తేదీ మన వ్యక్తిత్వం, కెరీర్ , భవిష్యత్తుపై ముడిపడి ఉంటుందని మీకు తెలుసా? జోతిష్యంతో మన భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చో..ఈ న్యూమరాలజీ ప్రకారం కూడా మన జీవితం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికైనా కోటీశ్వరులు అవ్వడం పక్కా. వారు ఎంత పేద కుటుంబంలో పుట్టినా, కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. మరి, ఆ తేదీలేంటో , ఆ తేదీల్లో పుట్టిన వారిలో స్పెషల్ క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందాం..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 అంటే.. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. వారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా వారు.. తమ కష్టపడే వ్యక్తిత్వంతో జీవితంలో ఎప్పటికైనా కోటీశ్వరులు అవ్వగలరు.
Numerology in Name
బుధుడి అనుగ్రహం..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 లో పుట్టిన వారిపై బుధ గ్రహం అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో రాణించే చతురత ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ.ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని తట్టుకొని నిలపడటం, వాటిని ఎదురించి తమ సత్తా చాటడం ఈ తేదీల్లో పుట్టిన వారికి వెన్నతో పుట్టిన విద్య. వీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఇతరులపై ఆధారపడటానికి మాత్రం ఇష్టపడరు. వారే స్వయంగా తమ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. వీరికి ఉద్యోగం కంటే, వ్యాపారాల్లో బాగా రాణించగలరు. వారి సృజనాత్మకత, తెలివితేటలతో వ్యాపారాల్లో తమ సత్తా చాటుతారు.
ఈ తేదీల్లో పుట్టినవారికి పుట్టుకతోనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. కొంచెం కూడా స్టేజ్ ఫియర్ ఉండదు. ఎలాంటి పోటీల్లో అయినా, స్టేజ్ మీద అయినా మాట్లాడటానికి కాస్త కూడా వెనకాడరు.తమ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వారి మాటలకు, ప్రసంగాలకు ఎవరైనా మంత్ర ముగ్ధులు అయిపోతారు.వీరి మాటలకు ఎవరైనా ప్రేమలో పడిపోతారు.
అంతేకాదు.. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ. కొత్త ప్రదేశంలో అడుగుపెట్టినా వీరికి ఎవరైనా స్నేహితులు అయిపోతారు.చాలా తొందరగా ఎవరితోనైనా కనెక్ట్ అయిపోతారు. అంతేకాదు, వీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీరి వ్యక్తిత్వం చాలా డైనమిక్ గా ఉంటుంది.మార్కెటింగ్, మీడియా, పర్యాటకం వంటి విభాగాల్లో వీరు బాగా రాణించగలరు. ఆర్థిక సమస్యలు తలెత్తినా, వాటిని తట్టుకుంటారు.నిరుత్సాహపడరు.