Mercury Venus Conjunction: బుధ, శుక్రుల కలయిక.. ఈ 4 రాశులవారికి రెట్టింపు సంపద!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. అలా త్వరలో బుధ, శుక్ర గ్రహాలు మీనరాశిలో కలవనున్నాయి. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల 4 రాశుల వారికి కీర్తి, సంపద రెట్టింపు కానుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా..

మీన రాశిలో బుధ, శుక్ర గ్రహాల కలయిక
జ్యోతిష్య శాస్త్రంలో బుధ, శుక్ర గ్రహాలను అత్యంత శుభ గ్రహాలుగా భావిస్తారు. బుధుడు జ్ఞానం, వాక్కు, వ్యాపారం, మానసిక శక్తికి కారకుడు. శుక్రుడు ప్రేమ, అందం, సౌకర్యాలు, సంబంధాలకు ప్రతీక. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కొన్ని రాశులవారి వ్వక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 28న బుధ, శుక్ర గ్రహాలు మీన రాశిలో కలవనున్నాయి. దానివల్ల 4 రాశులవారికి రెట్టింపు మేలు జరగనుంది. ఆ రాశులేంటో చూద్దాం.
మిథున రాశి
మిథున రాశి వారికి బుధ, శుక్ర గ్రహాల కలయిక ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. దానివల్ల ఉద్యోగంలో లాభాలు పొందుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం, రచన, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం లాభాలను తెచ్చి పెడుతుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు పెరుగుతాయి. ఈ సమయంలో స్నేహితులు లేదా తెలిసిన వారి ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కళ, ఫ్యాషన్, సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. బంధాలు మరింత మధురంగా మారుతాయి.
కన్య రాశి
కన్య రాశి వారికి బుధ, శుక్ర గ్రహాల కలయిక భాగస్వామ్యాలను, సంబంధాలను మెరుగుపరుస్తుంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వివాహం లేదా ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి. కొత్త ఒప్పందాలు వ్యాపారంలో స్థిరత్వాన్ని పెంచుతాయి.
మీన రాశి
బుధ, శుక్రుల సంయోగం మీన రాశిలోనే ఏర్పడబోతుంది కాబట్టి, దీని ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారి వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు క్రియేటివ్ గా చేసే పనుల వల్ల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు మెరుగ్గా ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆలోచనల్లో స్పష్టత పెరిగి, సరైన మార్గంలో ముందుకు సాగుతారు.

