MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ganga water: కాశీ నుంచి గంగాజలం తీసుకురావడం అశుభమా?

Ganga water: కాశీ నుంచి గంగాజలం తీసుకురావడం అశుభమా?

Ganga Water: హిందూ మతంలో గంగను దేవతలా పూజిస్తాము.  ప్రజలు గంగాజలాన్ని ఇంటికి తెచ్చి శుభ్రపరచుకుంటారు. కానీ కాశీలోని గంగా ఘాట్‌ల నుండి గంగాజలం తీసుకురావడం అశుభమని చాలా తక్కువమందికే తెలుసు. గరుడ పురాణం ఇదే విషయాన్ని చెబుతోంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 14 2025, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గంగాజలం ఎందుకంటే ప్రాధాన్యత
Image Credit : our own

గంగాజలం ఎందుకంటే ప్రాధాన్యత

హిందూమతంలో గంగను ఎంతో ప్రవిత్రంగా చూస్తారు.  గంగా ఘాట్‌లలో భక్తులు స్నానం చేశా పవిత్ర గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకుంటారు.  ఆ గంగాజలాన్ని ఇంటిని శుభ్రపరిచేందుకు ఉపయోగిస్తారు. ఇంట్లోని నెటివివ్ శక్తిని బయటికి పంపేందుకు గంగా జలాన్ని ఉపయోగిస్తారు.  గంగాజలాన్ని ఎంతో పవిత్రం పూజలు, మతపరమైన కార్యక్రమాల్లో వాడతారు.

26
కాశీ గంగా ఘాట్
Image Credit : our own

కాశీ గంగా ఘాట్

గంగా నది ఒడ్డున కాశీ నగరం ఉంది. దీన్ని వారణాసి అని పిలుస్తారు. కాశీ ఒక పవిత్ర నగరం. ఈ కాశీ నగరాన్ని మోక్షాన్ని పొందే ప్రదేశంగా పిలుచుకుంటారు. శివుడు వారణాసిలోనే నివసిస్తాడని శివ భక్తుల నమ్మకం. మోక్షం కోసం ప్రజలు కాశీకి వెళుతుంటారు.

Related Articles

Related image1
Birth Month: ఈ నెలలో పుట్టినవారి జీవితంలో విడాకులయ్యే ఛాన్స్ ఎక్కువ, బంధాలను కాపాడుకోలేరు
Related image2
Washing clothes: గురువారం రోజున బట్టలు ఉతకడం అశుభమా?
36
కాశీ నుండి గంగాజలం తేవచ్చా?
Image Credit : Google

కాశీ నుండి గంగాజలం తేవచ్చా?

హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి లేదా ప్రయాగ్‌రాజ్ నుండి గంగాజలం తేవడం శుభప్రదంగా భావిస్తారు. కానీ, శివుని నగరమైన కాశీ నుండి మాత్రం గంగాజలం తేకూడదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈసారి కాశీ  వెళ్లినప్పుడు అక్కడ నుంచి కాకుండా పైన చెప్పిన మిగతా నగరాల నుంచి గంగా జలం తెచ్చేందుకు ప్రయత్నించండి.

46
ఎందుకు అశుభం
Image Credit : google

ఎందుకు అశుభం

సనాతన ధర్మంలో కాశీని మోక్ష నగరంగా పిలుస్తారు. కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ల లో రోజూ ఎంతోమందికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. వారి అస్థికలను గంగా నదిలో కలుపుతారు. ఇలా చేస్తే మరణించిన ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్మకం. 

56
ఆత్మల శక్తి
Image Credit : pexels

ఆత్మల శక్తి

కాశీ నగరం దగ్గరలోని గంగాజలంలో ముక్తి పొందిన ఆత్మల శక్తి ఉంటుందని అంటారు. అందుకే అక్కడి నుండి గంగాజలం తేవడం అశుభంగా భావిస్తారు. ఎవరైనా ఇంటికి తెస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది ఇంట్లో ప్రాణాంతక సమస్య వచ్చే అవకాశం ఉందని అంటారు.

66
కాశీ మట్టిని కూడా...
Image Credit : our own

కాశీ మట్టిని కూడా...

మత విశ్వాసాల ప్రకారం, కాశీ నుండి గంగాజలం లేదా మట్టిని ఇంటికి తేవడం పాపంగా భావిస్తారు. తెలియక, ఈ గంగాజలాన్ని వాడి, చనిపోబోయే వారికి మోక్షం రాకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. కాబట్టి కాళీవెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related Stories
Recommended image1
Birth Month: ఈ నెలలో పుట్టినవారి జీవితంలో విడాకులయ్యే ఛాన్స్ ఎక్కువ, బంధాలను కాపాడుకోలేరు
Recommended image2
Washing clothes: గురువారం రోజున బట్టలు ఉతకడం అశుభమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved