MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అనుకూల ఫలితాలు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అనుకూల ఫలితాలు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 19.04.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 19 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మిత్రుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు.

Related Articles

Related image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Related image2
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. పాత రుణాలు తీర్చుతారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

సమాజంలో పెద్దల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ఇంటా బయటా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Alignment: మే నెలలో గ్రహాల అద్భుతం...ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్..!
Recommended image2
Dream: అక్షయ తృతీయ వేళ మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ పంట పండినట్లే..!
Recommended image3
Saturn Curse: మరో ఏడు సంవత్సరాలు ఈ మూడు రాశులకు చుక్కలు చూపించబోతున్న శని
Related Stories
Recommended image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Recommended image2
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved