Today Rasi Phalalu: ఈ రాశివారికి ప్రయాణాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 14.07.2025 సోమవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది.
వృషభ రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిథున రాశి ఫలాలు
నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.
సింహ రాశి ఫలాలు
డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు అందుతాయి. అప్పులు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారంతో కొన్ని సమస్యలు తొలగుతాయి.
తుల రాశి ఫలాలు
నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలం.
ధనుస్సు రాశి ఫలాలు
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాల్లోని సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
మకర రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాల్లో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
మీన రాశి ఫలాలు
మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.