MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశుల వారికి డబ్బుతో సంబంధం లేదు... ప్రేమ ఉంటే చాలు..!

Zodiac signs: ఈ రాశుల వారికి డబ్బుతో సంబంధం లేదు... ప్రేమ ఉంటే చాలు..!

Zodiac signs:  కొందరికి అసలు డబ్బుతో అవసరమే ఉండదు. తమ కుటుంబం, బంధాలు, ప్రేమ ముందు.. డబ్బు చాలా చిన్న విషయంగా అనిపిస్తూ ఉంటుంది. తమకు నచ్చిన వారు పక్కన ఉంటే.. ప్రపంచాన్నే జయించినట్లు ఫీలౌతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 12 2025, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Zodiac signs
Image Credit : AI Generated

Zodiac signs

మానవ జీవితంలో ప్రతి ఒక్కరికీ వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. కొందరికి డబ్బు, పదవి, కీర్తి, సంపద లాంటివి ఉంటే చాలు. అందరికీ ఇవే ముఖ్యం కాదు. కొందరికి అసలు డబ్బుతో అవసరమే ఉండదు. తమ కుటుంబం, బంధాలు, ప్రేమ ముందు.. డబ్బు చాలా చిన్న విషయంగా అనిపిస్తూ ఉంటుంది. తమకు నచ్చిన వారు పక్కన ఉంటే.. ప్రపంచాన్నే జయించినట్లు ఫీలౌతారు. జీవితంలో డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. మరి.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. అలాంటి లక్షణాలు ఉన్న రాశులేంటో ఓసారి చూద్దాం...

25
1.కర్కాటక రాశి...
Image Credit : Asianet News

1.కర్కాటక రాశి...

కర్కాటక రాశివారు సహజంగా కుటుంబం పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు. వారు తమ కుటుంబం, బంధువులు, స్నేహితుల కోసం.... ఏం చేయడానికి అయినా ముందుంటారు. ఏ విషయంలోనూ ఏ మాత్రం వెనకాడరు. వారి కోసం ఏదైనా త్యాగం చేయడంలో ముందుంటారు. ఈ రాశివారు.. డబ్బు, ఇల్లు, బంగారం, భూమి, కార్లు, ఆస్తులు ఇలాంటి వాటికి కొంచెం కూడా ఆకర్షితులు అవ్వరు. కానీ.. తాను నా అనుకున్న వాళ్లు సంతోషంగా నవ్వుతూ తన చుట్టూ ఉంటే మాత్రం చాలా అని అనుకుంటారు. అది వారికి స్వర్గం తో సమానం. కర్కాటక రాశివారు సహజంగా ఎమోషనల్ గా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమించారంటే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. వీరు చూపించిన ప్రేమ తిరిగి తమకు అందకపోతే.. లోలోపల బాధపడతారు తప్ప... బయటకు మాత్రం చూపించరు.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశుల వారు ఎవరినీ అంత ఈజీగా నమ్మరు..!
Related image2
Zodiac signs: ఈ రాశులవారు ఇతరుల ముందు తల వంచరు.. ఆత్మ గౌరవం చాలా ఎక్కువ..!
35
2.మీన రాశి....
Image Credit : Asianet News

2.మీన రాశి....

మీన రాశివారు సహజంగా కలల ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. వీరు తమ చుట్టూ ఉన్నవారిపై నిత్యం ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. డబ్బు సంపాదించడం వీరికి అసలు ఒక పెద్ద విషయమే కాదు.. కానీ.. దాని కంటే వీరు తమ చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే తమ గొప్ప విజయంగా భావిస్తారు.

మీన రాశి వారు అందరూ కలిసి నవ్వితే జీవితం అందంగా ఉంటుందనే నమ్మకంతో జీవిస్తారు. వారికి స్వార్థం తక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉంటే.. వీరి మనసు తట్టుకోలేదు. వెంటనే సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ ప్రపంచాన్ని జయించగలదని వీరు నమ్ముతారు. సంపద లేకపోయినా ప్రేమ ఉంటే చాలు అని నమ్ముతారు.

45
 సింహరాశి
Image Credit : Asianet News

సింహరాశి

బయటకు సింహరాశి వారు కఠినంగా , గంభీరంగా కనిపించినప్పటికీ, లోపల వారు గొప్ప ప్రేమతో నిండి ఉంటారు. వారు సులభంగా కీర్తిని పొందుతారు. అయితే, నిజమైన ప్రేమ లేని ప్రదేశంలో వారు ఎక్కువ కాలం ఉండలేరు. ప్రేమను పంచేవారు తమ చుట్టూ ఉంటే అంతకు మించిన సంపద మరొకటి లేదు అని ఈ రాశివారు నమ్ముతారు. ఎవరైనా తమను నిజంగా ప్రేమిస్తే, వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి వారు వెనుకాడరు.

55
 ప్రేమే జీవితం...
Image Credit : others

ప్రేమే జీవితం...

ఈ మూడు రాశుల వారికి, జీవితంలో గొప్ప సంపద ప్రేమ, అనురాగం. వారు ఇల్లు, భూమి లేదా సంపద గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వారి ప్రియమైనవారు వారి చుట్టూ లేకపోతే వీరు తట్టుకోలేరు. అదే.. తమకు నచ్చినవారు పక్కన ఉంటే మాత్రం ఎలాంటి ప్లేస్ లో అయినా హ్యాపీగా ఉండిపోగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల వారు ఎవరినీ అంత ఈజీగా నమ్మరు..!
Recommended image2
Zodiac signs: ఈ రాశులవారు ఇతరుల ముందు తల వంచరు.. ఆత్మ గౌరవం చాలా ఎక్కువ..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved