MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్రరాష్ట్ర పునర్నిర్మాణం.. భావితరాలకు స్ఫూర్తి పంచేలా అడుగులు వేస్తున్నాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఆంధ్రరాష్ట్ర పునర్నిర్మాణం.. భావితరాలకు స్ఫూర్తి పంచేలా అడుగులు వేస్తున్నాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నామ‌నీ, ప్రజలంతా మెచ్చేలా, భావితరాలకు స్ఫూర్తి పంచేలా కూటమి పాలన సాగుతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.  

3 Min read
Mahesh Rajamoni
Published : Aug 15 2024, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan, Janasena

Pawan Kalyan, Janasena

Pawan Kalyan : భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు దేశ‌మంత‌టా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే    కాకినాడలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. తన కూతురితో సెల్ఫీ తీసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. కాగా, సంద‌ర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని చెప్పారు. ‘ఇంటి నుంచి నిర్భయంగా బయటకు వెళ్లిన ప్రతి ఆడబిడ్డ అంతే భద్రంగా ఇంటికి తిరిగి రావాలి... దోపిడీలు, దౌర్జన్యాలు నశించే రోజులు సాకారం కావాలి. రాజీలేకుండా శాంతిభద్రతలు బలంగా అమలు జరగాలి... యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం అవ్వాలి... ఒక్కరి వద్దే మొత్తం డబ్బులన్నీ జమయ్యే పద్ధతి పోవాలి.. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి.. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గ సీమగా విరజిల్లాలి... ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధితోపాటు సంక్షేమ రథం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి... ఇవే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాలు’ అని స్పష్టం చేశారు.

25
Pawan Kalyan, Janasena

Pawan Kalyan, Janasena

ప్రజలు ఇచ్చిన అధికార బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, వారు పెట్టుకున్న నమ్మకాన్ని కచ్చితంగా నెరవేర్చుతామన్నారు. రాష్ట్రానికి తిరిగి జీవం పోసేలా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి బ్రాండ్ గా చేసేందుకు అన్ని విధాలా పాలనలో మార్పు తీసుకొస్తామని ప‌వ‌న్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలకు పునర్వైభవం తీసుకురావడంతోపాటు, ఆర్థికంగా అతలాకుతలం అయిన రాష్ట్రానికి జీవం పోసేలా వేగంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం వారికి శిక్షపడాలని పేర్కొన్నారు. 

35

అలాగే, "78 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దేశం తన ప్రయాణాన్ని సాగించింది. విభజన గాయాలు, యుద్ధాలు, క్షామం వంటివి దేశం చూసింది. మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి దార్శనికుడు పాలనతో భారతదేశం ప్రయాణాన్ని మొదలుపెడితే తర్వాత దేశాన్ని అంతే సమర్థంగా పాలించిన లాల్ బహుదూర్ శాస్త్రి, అపర దుర్గగా పేరు గాంచిన శ్రీమతి ఇందిరా గాంధీ, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిన గొప్ప నేత పీవీ నరసింహారావు, పోఖ్రాన్ లో అణు బాంబు పరీక్ష చేసి శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన అటల్ బిహారీ వాజ్ పేయి, పాతతరం నేతల్లా కాకుండా మా దేశం మీద దాడి చేస్తే మీకు అదే తరహాలో సమాధానం చెబుతామని నిరూపించిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ వరకు ఈ దేశం ఎందరో గొప్ప నేతలను చూసిందని" చెప్పారు. 

45

స్వాతంత్య్ర‌ దినోత్సవం అంటే చాక్లెట్లు పంచుకోవడానికో, సెలవు దినంగా ఎంజాయ్ చేయడానికో కాదని చెప్పిన ప‌వ‌న్..  "దేశం కోసం పోరాడిన ఎందరో త్యాగధనులు, వారి పోరాటాలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. 19 ఏళ్ల ఖుదిరాం బోస్ త్యాగం దగ్గర నుంచి 23 ఏళ్ల భగత్ సింగ్ వంటి యువకుల బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నాం. వారు తీసుకొచ్చిన స్వాతంత్య్రాన్ని అంతే బాధ్యతతో భావితరాలకు అందించాలి. 1925లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ఓ అపురూప ఘట్టం. ఉప్పు సత్యాగ్రహంలోనూ ఉప్పాడ, చొల్లంగి గ్రామాల్లో ప్రజలు అశేషంగా పాల్గొన్నారు. కాకినాడకు చెందిన భయంకరాచారి, బులుసు సాంబమూర్తి, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ వంటివారు జిల్లాకు చెందిన ఎందరో గొప్ప వ్యక్తులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలాంటి గొప్ప నేలలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందనిష" తెలిపారు. 

 

55

ఆంధ్రప్రదేశ్ కు పునరుజ్జీవం పోస్తామ‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. "సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. 28 కేటగిరిల్లో ప్రజలకు సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పెంచింది. కాకినాడ జిల్లాలో 17 కేటగిరిల్లో 2,77,594 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నాం. ఆంధ్రుల అన్నపూర్ణగా భావించే డొక్కా సీతమ్మ పథకంతో జిల్లాలోని 1258 పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. అన్నా క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి పేదలకు రూ.5లకే భోజనం అందించే కార్యక్రమం మొదలుపెట్టాం. జిల్లాలో మొత్తం 11 క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి. ఇసుక విధానంలో మార్పులు చేసి, ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా యూనిట్ కు రూ.4 లక్షలు అందజేస్తాం. పెండింగ్ లో రూ.49 కోట్లు బిల్లులు చెల్లించే ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 37 కౌంటర్లలో ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందిస్తున్నామ‌ని" చెప్పారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
జనసేన
పవన్ కళ్యాణ్
Latest Videos
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved