MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తప్పు చేసిన వారు త‌ప్పించుకోలేరు.. తుని మైన‌ర్ బాలిక ఘ‌ట‌న‌లో ఇది నిరూపిత‌మైంది

తప్పు చేసిన వారు త‌ప్పించుకోలేరు.. తుని మైన‌ర్ బాలిక ఘ‌ట‌న‌లో ఇది నిరూపిత‌మైంది

AP News: త‌ప్పు చేసిన వారెవ‌రూ త‌ప్పించుకోలేరు, శిక్ష‌ప‌డే కాలం పెరుగుతుంది అంతే.. ఇది ఒక సినిమాలోని డైలాగ్‌. తాజాగా కాకినాడ జిల్లాలో జ‌రిగిన ఓ ఉదంతం దీనికి స‌రిగ్గా స‌రిపోతుంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 23 2025, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గురుకుల పాఠశాల విద్యార్థినిపై దారుణం
Image Credit : VenkataReddy karmuru/X

గురుకుల పాఠశాల విద్యార్థినిపై దారుణం

కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఒక దారుణ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. స్థానికంగా ఉన్న జగన్నాథగిరి గురుకుల బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఆమె బంధువని చెప్పుకున్న తాటిక నారాయణరావు (62) అనే వ్యక్తి మోసం చేసి బయటికి తీసుకెళ్లాడు. “ఆసుపత్రికి తీసుకెళ్తా” అనే నెపంతో ఆమెను స్కూల్ నుంచి స్కూటీపై తీసుకెళ్లి, తొండంగి మండలం పైడికొండ గ్రామ శివార్లలోని సపోటా తోటకు తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారానికి య‌త్నించాడు.

25
ఎలా వెలుగులోకి వ‌చ్చిందంటే.?
Image Credit : X

ఎలా వెలుగులోకి వ‌చ్చిందంటే.?

బాలిక కేకలు విన్న తోటమాలి అక్కడికి చేరుకుని నారాయణరావును నిలదీశాడు. తాను ఆ బాలికకు తాతయ్య వరుస అవుతానని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం స్కూటీపై బాలికను ఎక్కించుకుని హాస్టల్‌కి చేరి ఆమెను దింపి వెళ్లిపోయాడు. కానీ తోటలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఒక వ్యక్తి గుప్తంగా చిత్రీకరించాడు. ఈ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది.

Related Articles

Related image1
ఎంత క‌ష్టం వ‌చ్చినా ఓర్పుతో ఎందుకు ఉండాలి.? బుద్ధుడు చెప్పిన క‌థ చ‌దివితే మీకే తెలుస్తుంది.
Related image2
బ‌లప‌డుతోన్న వాయుగుండం.. వ‌చ్చే 3 రోజులు అల్ల‌క‌ల్లోల‌మే, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు
35
పోలీసులకు అప్పగింత
Image Credit : social media

పోలీసులకు అప్పగింత

వీడియో బయటపడిన వెంటనే గ్రామస్థులు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్ర‌హించారు. నిందితుడు నారాయణరావును పట్టుకుని బహిరంగంగా దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం, అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటన రాజకీయ కోణం తీసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది కేసును వేరే దారిలో మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.

45
పోలీసు కస్టడీలోనే నిందితుడి ఆత్మహత్య
Image Credit : social media

పోలీసు కస్టడీలోనే నిందితుడి ఆత్మహత్య

అరెస్ట్ అయిన నారాయణరావును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా, మధ్యలో వాష్‌రూమ్‌ అవసరమని చెప్పి పోలీసు వాహనం నుంచి దిగాడు. తునిలోని కోమటి చెరువు వద్దకు వెళ్లి నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెంటనే గజఈతగాళ్లతో గాలింపు ప్రారంభించారు. అనంతరం అతని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై డీఎస్పీ శ్రీహరిరాజు స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసిన ప్రజలు తప్పు చేసిన వారికి ఆ దేవుడు ఇలాంటి సరైన గుణపాఠం చెబుతారంటూ అభిప్రాయపడుతున్నారు. 

55
రాజకీయ ప్రతిస్పందనలు
Image Credit : X

రాజకీయ ప్రతిస్పందనలు

ఈ కేసుపై రాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. మంత్రి నారా లోకేశ్ బాధితురాలికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ కేసును సుమోటోగా స్వీకరించి, దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో వైసీపీ ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ “టీడీపీ నేతల చేతిలో ఆడబిడ్డలు సురక్షితం కాదని” ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా టీడీపీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ “నారాయణరావుకు ప్రస్తుతం పార్టీలో ఎలాంటి పదవీ లేదు, తప్పు చేసినవారు ఎవరివారైనా శిక్ష తప్పదు” అని స్పష్టం చేసింది.

సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే… pic.twitter.com/FxNTLHOttB

— Telugu Desam Party (@JaiTDP) October 22, 2025

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
ఎంత క‌ష్టం వ‌చ్చినా ఓర్పుతో ఎందుకు ఉండాలి.? బుద్ధుడు చెప్పిన క‌థ చ‌దివితే మీకే తెలుస్తుంది.
Recommended image2
బ‌లప‌డుతోన్న వాయుగుండం.. వ‌చ్చే 3 రోజులు అల్ల‌క‌ల్లోల‌మే, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved