MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Tirumala: తిరుమ‌ల వెంక‌న్న భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. అలాంటి వాహ‌నాల్లో వ‌స్తే ద‌ర్శ‌నం ఉండ‌దు.

Tirumala: తిరుమ‌ల వెంక‌న్న భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. అలాంటి వాహ‌నాల్లో వ‌స్తే ద‌ర్శ‌నం ఉండ‌దు.

తిరుమల‌ వెంక‌న్న స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి ప్ర‌తీ రోజూ వేలాది మంది వ‌స్తుంటారు. ఏడు కొండ‌ల ప్రాముఖ్య‌త‌ను కాపాడేందుకు టీటీడీ ఎన్నో చ‌ర్య‌లు చేప‌డ‌తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా అధికారులు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 09 2025, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుమలలో వాహనాలపై కఠిన నియంత్రణలు
Image Credit : our own

తిరుమలలో వాహనాలపై కఠిన నియంత్రణలు

తిరుమల కొండపై పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. ప్రతి రోజు సుమారు 8 వేల ప్రైవేటు కార్లు తిరుమ‌లకు వ‌స్తుండ‌డంతో కొండ‌పై కాలుష్యం పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కువ‌గా పొగ వ‌చ్చే వాహనాలను తిరుమలకు అనుమతించకూడదన్న తీర్మానాన్ని టీటీడీ తీసుకుంది.

25
అలిపిరిలో చెక్‌పోస్టు, స్మోక్‌ టెస్ట్‌
Image Credit : our own

అలిపిరిలో చెక్‌పోస్టు, స్మోక్‌ టెస్ట్‌

తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరిలో చెకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ర్యాండమ్ తనిఖీలు చేస్తూ, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనివాహనాలపై దృష్టిసారిస్తున్నారు. స్మోక్ మీటర్ ద్వారా వాహన ఉద్గారాలను పరిశీలించి, వాటి స్థాయి 4.0 యూనిట్లకు మించి ఉంటే వెంటనే వెనక్కు పంపిస్తున్నారు.

Related Articles

Related image1
Zodiac sign: ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు
Related image2
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
35
తిరుమలకు వస్తున్న భక్తులకు హెచ్చరిక
Image Credit : our own

తిరుమలకు వస్తున్న భక్తులకు హెచ్చరిక

తిరుమల శ్రీవారి దర్శనానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తులు, తమ వాహనాల పొల్యూషన్ స్టేట‌స్‌ను ముందుగానే పరిశీలించుకోవాలి. సర్టిఫికెట్ లేకపోవడం లేదా ఉద్గారాలు అధికంగా విడుదల కావడం వల్ల తిరుమలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయే అవ‌కాశం ఉంది. కొండ‌పై కాలుష్యాన్ని త‌గ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

45
అన్నప్రసాదంలో కొత్తగా వడలు కూడా
Image Credit : our own

అన్నప్రసాదంలో కొత్తగా వడలు కూడా

ఇదిలా ఉంటే టీటీడీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే వడలు అందించగా, ఇప్పుడు రాత్రి భోజన సమయంలో కూడా వడ్డించనున్నారు. వడల పంపిణీలో జాప్యం లేకుండా అందించేందుకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

55
ప్రతి రోజూ ఉదయం 11 నుంచి
Image Credit : our own

ప్రతి రోజూ ఉదయం 11 నుంచి

ఇప్పటివరకు అన్నప్రసాదంలో పచ్చడి, స్వీట్, అన్నం, పప్పు, కూర, సాంబార్, రసం, మజ్జిగ పులుసు మాత్రమే ఉండేవి. ఇకపై వీటితో పాటు వడ కూడా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు వడలను వడ్డించనున్నారు.

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు స్వయంగా ప్రారంభోత్సవంలో పాల్గొని భక్తులకు వడలు వడ్డించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో భక్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
Zodiac sign: ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు
Recommended image2
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved