- Home
- Andhra Pradesh
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల, తిరుపతిలో క్యూ ఆర్ కోడ్‌ల ఏర్పాటు. వీటి ఉపయోగం ఏంటంటే..
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల, తిరుపతిలో క్యూ ఆర్ కోడ్‌ల ఏర్పాటు. వీటి ఉపయోగం ఏంటంటే..
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీ రోజూ వేలా మంది భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుపతి విచ్చేస్తుంటారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లను అదే స్థాయిలో చేస్తుంది. ఎప్పటికప్పుడు భక్తుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న టీటీడీ తాజాగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

TTD News
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కొత్త సేవను ప్రారంభించింది. భక్తుల అనుభవాలను తెలుసుకోవడానికి వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ మెకానిజాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది.
ఈ నూతన విధానంలో భాగంగా తిరుమల, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసింది. భక్తులు తమ మొబైల్ ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే, వాట్సాప్‌లో అభిప్రాయం పంపే ప్రత్యేక పేజీ తెరుచుకుంటుంది.
అక్కడ భక్తులు ముందుగా తమ పేరు, సేవ విభాగాన్ని (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శనం, క్యూలైన్, గదులు మొదలైనవి) ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయాన్ని టెక్స్ట్ లేదా వీడియో రూపంలో పంపే సౌకర్యం ఉంటుంది.
సేవల నాణ్యతకు తగిన రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది – ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా తగిన అభివృద్ధి అవసరం అనే విభాగాల్లో. అభిప్రాయం గరిష్టంగా 600 అక్షరాల్లో పంపొచ్చు లేదా వీడియో ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయొచ్చు.
అభిప్రాయం పంపిన వెంటనే ధృవీకరణ సందేశం వస్తుంది: “మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు.” టీటీడీ ఈ ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించి సేవల్లో మార్పులు చేసేందుకు ఉపయోగించనుంది.
Tirumala
మే 4న స్థానిక కోటా టోకెన్ల జారీ:
ఇదిలా ఉంటే టీటీడీ భక్తులకు మరో అప్డేట్ కూడా ఇచ్చింది. మే 4వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు అందించే ఈ టోకా దర్శనానికి సంబంధించిన టోకెన్లు మే 4న ఉదయం 5 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
Tirumala
తిరుపతి ప్రాంతానికి చెందిన భక్తులకు మహతి ఆడిటోరియంలో, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్లు అందజేస్తారు. టోకెన్లు మొదటివారికి ముందు ప్రాధాన్యత పద్ధతిలో ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ సేవకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానికులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ సూచించింది.