MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : ఓ ఉపరితల ఆవర్తనం, మరో ద్రోణి ... ఈ ప్రాంతాల్లో ప్రమాదకర వర్షాలు

IMD Rain Alert : ఓ ఉపరితల ఆవర్తనం, మరో ద్రోణి ... ఈ ప్రాంతాల్లో ప్రమాదకర వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ ప్రాంతాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 06 2025, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Image Credit : X/APSDMA

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

IMD Rain Alert : వర్షాకాలం ఎప్పుడో ముగిసింది.. వానలు కురిపించే నైరుతి రుతుపవనాలు నెల క్రితమే దేశాన్ని వీడాయి. కానీ తెలుగు రాష్ట్రాలను మాత్రం వర్షాలు వదిలిపెట్టడంలేదు. ఇంకా చెప్పాలంటే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులతో వర్షాకాలంలో కంటే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల మొంథా తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతటి బీభత్సం సృష్టించిందో చూశాం. తెలంగాణలో కూడా భారీ వర్షాలను కురిపించింది. ఈ మొంథా తుపాను బీభత్సాన్ని మర్చిపోకముందే మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది... ఇది తెలుగు ప్రజలను కాస్త ఆందోళనకు గురిచేసే అంశం.

25
ద్రోణి ప్రభావంతో వర్షాలు
Image Credit : social media

ద్రోణి ప్రభావంతో వర్షాలు

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక ఇప్పటికే కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందట. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA ప్రకటించింది.

Related Articles

Related image1
Interesting Facts : పిడుగులు చెట్లపైనే ఎందుకు పడతాయో తెలుసా?
Related image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్ష బీభత్సమే
35
ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
Image Credit : Generated by google gemini AI

ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు

ఇవాళ (నవంబర్ 6, గురువారం) కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. వర్ష సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది... కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

45
ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే
Image Credit : PTI

ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే

నిన్న (నవంబర్ 5, బుధవారం) ఏపీలో మోస్తరు వర్షాలు కురిశాయి. సాయంత్రం 4 గంటల వరకు ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో అత్యధికంగా 65.2మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఇక శ్రీసత్యసాయి జిల్లా గండ్లపెంటలో 45మిమీ, నెల్లూరు జిల్లా రాపూర్ 40.5మిమీ, విజయవాడ తూర్పులో 39మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని APSDMA తెలిపింది.

55
నేడు తెలంగాణలో వర్షాలు
Image Credit : Getty

నేడు తెలంగాణలో వర్షాలు

ఇక తెలంగాణలో కూడా గురువారం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కిమీ వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
Interesting Facts : పిడుగులు చెట్లపైనే ఎందుకు పడతాయో తెలుసా?
Recommended image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్ష బీభత్సమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved