Andhra Pradesh లో వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా విద్యుత్..!
ఆగస్టు 7 నుంచి చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు మంత్రి సవిత ప్రకటించారు.

చేనేత వృత్తి
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగానికి ఉచిత విద్యుత్ అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొమ్మరసాని సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
ఉచిత విద్యుత్
ఆగస్టు 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇదే విధంగా పవర్ లూమ్ యంత్రాలను నడిపే వారికైతే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించనుంది. ఈ అవకాశంతో చేనేత రంగానికి గణనీయమైన ఉపశమనం లభించనుంది.
నేతన్నల ఆరోగ్యం
అంతేకాకుండా, చేనేత కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేకమైన ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఆప్కో) కేంద్రాలను మరింతగా విస్తరించనున్నారు.
అవార్డులు
ఇటీవల చేనేత రంగానికి వివిధ విభాగాల నుంచి వచ్చిన అవార్డుల విషయాన్ని కూడా మంత్రి వెల్లడించారు. ఏడే ఏళ్ల కాలంలో చేనేత రంగానికి ఏడూ జాతీయ స్థాయి అవార్డులు లభించాయని గర్వంగా తెలిపారు. ఇది ఈ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు.
ఉచిత విద్యుత్
చేనేత కార్మికులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య పథకం, మార్కెటింగ్ మద్దతు వంటి అవకాశాలు వారికి మేలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.