MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మొంథా తుపాను ఉగ్రరూపం : అతిభారీ వర్షాలు.. ఏపీలో అలర్ట్ ! ట్రైన్స్, ఫ్లైట్స్ రద్దు

మొంథా తుపాను ఉగ్రరూపం : అతిభారీ వర్షాలు.. ఏపీలో అలర్ట్ ! ట్రైన్స్, ఫ్లైట్స్ రద్దు

Cyclone Montha Alerts: బంగాళాఖాతంలో విరుచుకుపడుతున్న మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని గంటల్లో 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. రైలు, విమాన సర్వీసులు రద్దు చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 28 2025, 12:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొంథా తుఫాన్ వేగం పెరుగుతోంది
Image Credit : ANI

మొంథా తుఫాన్ వేగం పెరుగుతోంది

బంగాళాఖాతంలో బలపడిన మొంథా తుపాన్ వేగంగా తీరం దిశగా ప్రయాణిస్తోంది. గడచిన 6 గంటల్లో 17 కి.మీ వేగంతో కదిలిన ఈ తుపాను కేంద్రం ప్రస్తుతం చెన్నైకి 480 కి.మీ, కాకినాడకు530 కి.మీ, విశాఖపట్నంకు 560 కి.మీ దూరంలో ఉందని అధికారులు ప్రకటించారు.

పశ్చిమ వాయవ్య దిశగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్రమైన తుపానుగా మారనుంది. కాకినాడ సమీప తీరం మీదుగా ఇది దూసుకుపోతుందని అంచనాలున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ప్రఖర్ జైన్ నేతృత్వంలో విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే అన్ని వ్యవస్థలను అలర్ట్‌లో ఉంచింది. తీర ప్రాంత ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ అయ్యాయి.

25
యానాంలో అలర్ట్
Image Credit : Asianet News

యానాంలో అలర్ట్

కాకినాడ, యానాం మధ్య తీరం దాటొచ్చని అంచనా నేపథ్యంలో యానాం యంత్రాంగం అప్రమత్తమైంది. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక అధికారి అమన్ శర్మ యానాం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై శాఖల పనితీరును వివరంగా సమీక్షించారు. 16 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల నుంచి తరలింపుకు వాహనాల సిద్ధంగా ఉంచారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు మైక్ ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన నిత్యావసర వస్తువులను ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచనలు కూడా అందించారు.

Related Articles

Related image1
అనంతపురం యువకుడికి రూ.2.25 కోట్ల జీతంతో గూగుల్‌లో జాబ్ !
Related image2
7 నెలల గర్భిణీ.. 145 కిలోల బరువు ఎత్తి మెడల్ గెలిచింది !
35
విజయవాడకు భారీ వర్షాల హెచ్చరికలు
Image Credit : ANI

విజయవాడకు భారీ వర్షాల హెచ్చరికలు

తుపాను ప్రభావంతో విజయవాడలో 162 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. షాపులు మూసివేయాలని సూచనలు చేశారు. మెడికల్ షాపులు, పాలు, కూరగాయల దుకాణాలకు మినహాయింపులు ఇచ్చారు. 40 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో జేసీబీలు, పంపులు సిద్ధంగా ఉంచారు.

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు 9154970454 / 0866 2424172 / 0866 2422515 / 0866 2427485 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు చేశారు.

45
రైలు, ఫ్లైట్ సర్వీసులపై తుపాను ప్రభావం
Image Credit : social media

రైలు, ఫ్లైట్ సర్వీసులపై తుపాను ప్రభావం

మొంథా తుపాను నేపథ్యంలో రవాణా వ్యవస్థపై గట్టి ప్రభావం పడుతోంది.

విమానాల రద్దు

విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానాలు అక్టోబర్ 28న రద్దు చేశారు. అందులో..

• విశాఖ–విజయవాడ

• విజయవాడ–హైదరాబాద్

• బెంగళూరు–విజయవాడ

• షార్జా–విజయవాడ

రైలు సేవలపై ప్రభావం

వందకు పైగా రైళ్లు రద్దు చేశారు.

• ఈస్ట్ కోస్ట్ రైల్వే మొదట 43

• దక్షిణ మధ్య రైల్వే అదనంగా 75+ రైళ్లు

• విజయవాడ పరిధిలో 54 రైళ్లు రద్దు చేశారు. టికెట్‌ మొత్తాలు రిఫండ్ చేశారు.

55
తీరప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు
Image Credit : Asianet News

తీరప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు

పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే అలజడి వాతావరణం ఉందని సమాచారం. భారీ గాలులు, వర్షాలు కొనసాగుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరించారు. తాండవ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల ఉంటుందని సమాచారం. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
నారా లోకేష్
నారా చంద్రబాబు నాయుడు
వాతావరణం
పవన్ కళ్యాణ్
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
అనంతపురం యువకుడికి రూ.2.25 కోట్ల జీతంతో గూగుల్‌లో జాబ్ !
Recommended image2
7 నెలల గర్భిణీ.. 145 కిలోల బరువు ఎత్తి మెడల్ గెలిచింది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved