Thalliki Vandanam: మీ అకౌంట్ లో తల్లికి వందనం డబ్బులు పడలేవా.? అయితే ఇలా చేయండి
తల్లికి వందనం పథకం డబ్బులు అందని వారు జూన్ 20లోపు ఫిర్యాదు చేయొచ్చు. అర్హత జాబితా తిరిగి తయారుచేసి జూలై 5న డబ్బులు జమ చేస్తారు.

తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకం కింద జూన్ 12, 13 తేదీల్లో ఎలిజబుల్ అయిన చాలా తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. అయితే, కొందరికి డబ్బులు రాకపోవడం, కొందరికి అర్హత ఉన్నా కూడా అనర్హుల జాబితాలోకి చేరడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఫిర్యాదులను స్వీకరణ
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించింది. జూన్ 12 నుంచి 20 వరకు ఫిర్యాదులను స్వీకరించనుందని అధికారులు తెలిపారు.
ఫిర్యాదు ఎలా చేయాలి?
గ్రామ/వార్డు సచివాలయాల్లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం భర్తీ చేసి ఇవ్వాలి
ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది
అధికారుల సూచన మేరకు చాలా మంది వ్యక్తిగతంగా సచివాలయాలకే వెళ్లి ఫిర్యాదులు అందజేస్తున్నారు.
జూన్ 16 (ఈ రోజు) నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
జూన్ 12-20: ఫిర్యాదుల స్వీకరణ
జూన్ 21-28: గ్రీవెన్స్ పరిశీలన, అదనపు అర్హుల జాబితా సిద్ధం చేయడం
జూన్ 30: ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకూ అర్హుల జాబితా ప్రదర్శన
జూలై 5: డబ్బుల జమ
అర్హత ప్రమాణాలు
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10,000 లోపు, పట్టణాల్లో రూ.12,000 లోపు ఉండాలి.
కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి.మాగాణి భూమి ≤ 3 ఎకరాలు, మెట్ట భూమి ≤ 10 ఎకరాలు (రెండు కలిపి ≤ 10 ఎకరాలు) లోపు ఉండాలి.మున్సిపాలిటీ/కార్పొరేషన్ పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థిరాస్తి ఉండాలి.నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (ట్యాక్సీలు, ఆటోలు మినహాయింపు)విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి.
విద్యార్థికి కనీసం 75% హాజరు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కాదు (పారిశుద్ధ్య కార్మికులు మినహాయింపు).కుటుంబ సభ్యుల్లో ఎవరు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించినా అర్హులు కాదువిద్యార్థి గుర్తింపు పొందిన పాఠశాలలు/జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ 2వ సంవత్సరం వరకూ చదువుతూ ఉండాలిఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ పథకం వర్తించదు