MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: ఏపీలో ఉచిత బ‌స్సు ప్రయాణం.. తెలంగాణ కంటే భిన్నంగా

Andhra Pradesh: ఏపీలో ఉచిత బ‌స్సు ప్రయాణం.. తెలంగాణ కంటే భిన్నంగా

ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఒక్కో హామీల‌ను సాకారం చేసే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో ముందడుగు వేసింది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించారు. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 30 2025, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం దృష్టి
Image Credit : Google gemini AI

ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ‌నివారం సమీక్ష నిర్వహించారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతుండగా... ఆంధ్రప్రదేశ్‌ తమ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశారు.

25
ఎప్ప‌టి నుంచి ప్రారంభం కానుందంటే.
Image Credit : I&PR AP

ఎప్ప‌టి నుంచి ప్రారంభం కానుందంటే.

ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చంద్ర‌బాబు తెలిపారు. కాగా ఉచిత ప్రయాణ పథకం అమలుతో మహిళల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్రంలో అదనంగా 2,536 బస్సులు అవసరమవుతాయని అంచనా.

 వీటిని కొనుగోలు చేయడమో, అద్దెకు తీసుకోవడమో వంటి ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా విద్యుత్‌ బస్సులను ప్రాధాన్యంగా కొనుగోలు చేయాలని, ఇప్పుడున్న డీజిల్ బస్సులను ఈవీకి మార్చే అవకాశాలను పరిశీలించాలన్నారు.

Related Articles

Related image1
Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. నెల‌కు రూ. 50 వేలు సంపాదించొచ్చు. బెస్ట్‌ బిజినెస్ ఐడియా
Related image2
Viral Video: ఏఐతో ఏదైనా సాధ్య‌మే.. కెమెరా, సెట్స్‌, లొకేష‌న్ ఇవేవీ లేకుండానే యాడ్స్‌. ఈ వీడియో చూస్తే మ‌తి పోవాల్సిందే.
35
ఆర్టీసీకి ఆదాయ మార్గాల అన్వేషణ
Image Credit : others

ఆర్టీసీకి ఆదాయ మార్గాల అన్వేషణ

ఆర్థికంగా బలపడాలంటే ఆర్టీసీకి కొత్త ఆదాయ మార్గాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. బ్యాటరీ స్వాపింగ్, సీఎన్జీ, విద్యుత్‌ బస్సుల నిర్వహణ ఖర్చులను తక్కువ చేయడానికి ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సేవలు అందించాలన్న అంశాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తిని ఆర్టీసీ స్వయంగా నిర్వహిస్తే, బస్సుల నిర్వహణ ఖర్చు తగ్గే అవకాశాలపై కూడా దృష్టిపెట్టాలని సూచించారు.

45
ప్రయాణికులకు మెరుగైన వాతావరణం
Image Credit : others

ప్రయాణికులకు మెరుగైన వాతావరణం

బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు మెరుగుపర్చాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు మహిళలకు సౌకర్యవంతమైన అనుభవం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే సమాచార బోర్డులు, శుభ్రత, భద్రత వంటి అంశాల్లో నూతన ప్రమాణాలు ఏర్పరచాలని అధికారులను ఆదేశించారు.

55
ఏటా 88.90 కోట్ల మహిళల ప్రయాణాలు
Image Credit : others

ఏటా 88.90 కోట్ల మహిళల ప్రయాణాలు

రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరిలో సాధారణ బస్సుల ద్వారా ఏడాదిలో 43 కోట్ల ప్రయాణాలు జరుగుతున్నాయి. ఉచిత ప్రయాణ పథకం అమలుతో ఇది 88.90 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ప్రతి మహిళ వారానికి కనీసం ఒక్కసారైనా ప్రయాణించనుంది. ఈ మొత్తం ప్రయాణ వ్యయానికి ఏడాదికి సుమారు రూ.996 కోట్లు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. నెల‌కు రూ. 50 వేలు సంపాదించొచ్చు. బెస్ట్‌ బిజినెస్ ఐడియా
Recommended image2
Viral Video: ఏఐతో ఏదైనా సాధ్య‌మే.. కెమెరా, సెట్స్‌, లొకేష‌న్ ఇవేవీ లేకుండానే యాడ్స్‌. ఈ వీడియో చూస్తే మ‌తి పోవాల్సిందే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved