Shikhar Dhawan confirmed relationship with Sophie Shine: ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తనకున్న సంబంధంపై శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మై లవ్ అంటూ ఎమోజీతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు.
Shikhar Dhawan confirmed relationship with Sophie Shine: మాజీ భార్య ఆయేషా ముఖర్జీ నుండి విడాకులు తీసుకున్న రెండు సంవత్సరాల తరువాత భారత స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ తొ డేటింగ్ లో ఉన్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. గురువారం సోషల్ మీడియా పోస్ట్‌లో శిఖర్ ధావన్ సోఫీ షైన్‌తో తన సంబంధాన్ని ధృవీకరించాడు.
దీంతో అన్ని ఊహాగానాలకు తెరపడింది. ధావన్, షైన్ చాలా కాలంగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మై లవ్ అంటూ ఎమోజీ సింబల్ తో శిఖర్ ధావన్ వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ పోస్టుకు సోఫీతో పాటు చాహల్ కూడా లైక్ కొట్టారు. దీంతో ఈ జోడీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
సోఫీ షైన్ ఎవరు?
సోఫీ షైన్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 134K ఫాలోవర్లు ఉన్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె 2018 నుండి నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్ట్ కన్సల్టేషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలోని కంపెనీలో పనిచేస్తుంది. ఆమె ఐర్లాండ్‌లోని లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని పూర్తి చేశారు. కాజిల్‌రాయ్ కాలేజీలో కూడా చదువుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ధావన్, షైన్ స్టాండ్స్‌లో కలిసి కనిపించారు. దీంతో అప్పటి నుంచి వీరు వైరల్ గా మారారు.
కాగా, శిఖర్ ధావన్ 2012లో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఆయేషాను వివాహం చేసుకున్నాడు. 2023 అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టు (DC) ఈ స్టార్ భారత క్రికెటర్ ధావన్-ఆయేషాకు విడాకులు మంజూరు చేసింది. ఈ జంటకు 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.
ధావన్ ఆగస్టు 2024లో అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను చివరిసారిగా 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడాడు. భారతదేశం తరపున చివరిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODIలో ఆడాడు.
