హీరో మోటోకార్ప్ 2025లో తన ప్రసిద్ధ మోడల్ స్ప్లెండర్ ప్లస్ XTEC ను మరింత ఆధునీకరించి మార్కెట్లోకి తీసుకువచ్చింది. మైలేజ్‌కు ప్రాముఖ్యతనిచ్చే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్‌ను హీరో కంపెనీ తయారు చేసింది. ఈ ఫ్యామిలీ బైక్ ఫీచర్లు తెలుసుకుందామా?

ఫ్యామిలీ మెన్ బైక్ గా గుర్తింపు పొందిన స్ప్లెండర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ మధ్య తరగతి వారికి ఫేవరేట్‌గా కొనసాగుతోంది. 2025లో అనేక అప్‌డేట్స్‌తో మళ్లీ మార్కెట్ లోకి వచ్చింది. స్ప్లెండర్ ప్లస్ XTEC బైక్ అదిరిపోయే మైలేజ్, డిజిటల్ మీటర్, LED లైట్లు, నమ్మకమైన ఇంజిన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని మైలేజ్, ధర తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

స్ప్లెండర్ ప్లస్ XTEC మైలేజ్

స్ప్లెండర్ ప్లస్ XTEC కొత్త టెక్నాలజీ, ఫీచర్లను కలిగి ఉంది. సూపర్ మైలేజ్, కొత్త డిజిటల్ ఫీచర్లు, నమ్మకమైన ఇంజిన్ ఇందులో ప్రత్యేకతలు. XTEC మైలేజ్ నగరాల్లో అయితే 80-85 కి.మీ. ఇస్తుంది. అదే హైవేలో అయితే ఏకంగా 95 కి.మీ. వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇంతటి మైలేజ్ ఇచ్చే బైక్ ఫ్యామిలీ మెన్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

స్ప్లెండర్ ప్లస్ XTEC ఫీచర్లు

XTEC వేరియంట్‌లో డిజిటల్ మీటర్, LED హెడ్‌లైట్లు, DRLలు, టెయిల్ లైట్లు, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, CBS లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 

స్ప్లెండర్ ప్లస్ XTEC ఖరీదు

జూన్ 2025 నాటికి స్ప్లెండర్ ప్లస్ XTEC ధర డ్రమ్ బ్రేక్ వెర్షన్ అయితే దాదాపు రూ.79,900 నుండి మొదలవుతుంది. డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర అయితే రూ.83,500 (ఎక్స్-షోరూమ్). కొత్త స్ప్లెండర్ XTEC 2.0 మోడల్ ధర అయితే రూ.82,900 గా ఉంది. చాలా నగరాల్లో ఆన్ రోడ్ ధర రూ.లక్ష కన్నా తక్కువే ఉంది. ఫ్యామిలీ అవసరాల కోసం బైక్ కొనుక్కోవాలనుకొనేవారికి ఇదే బెస్ట్ బైక్. 

స్ప్లెండర్ ప్లస్ XTEC రంగులు, డిజైన్

ఈ బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది. కాండీ బ్లాజింగ్ రెడ్, బ్లాక్ గోల్డ్, మాట్ ఎక్స్ యాక్సిస్ గ్రే, స్పార్కలింగ్ బ్లూ. XTEC బ్యాడ్జింగ్‌తో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ బైక్‌లో IBS (ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్) ఉంటుంది. ఇది ముందు, వెనుక బ్రేక్‌లను సమయానుకూలంగా పనిచేసేలా చేస్తుంది. కొత్త ఫీచర్లతో సూపర్ మైలేజ్ కావాలనుకునే వాళ్లకి స్ప్లెండర్ ప్లస్ XTEC సూపర్ బైక్. కొత్త టెక్నాలజీ, స్టైలింగ్ ఈ బైక్‌కి కొత్త లుక్ ఇచ్చాయి. బడ్జెట్‌లో, తక్కువ ఖర్చుతో నడిచే, మంచి మైలేజ్ బైక్ కావాలంటే XTEC 2025లో మంచి ఆప్షన్.