సిట్రోయెన్ కంపెనీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇండియాలో అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ కంపెనీ కార్లపై రూ.2.80 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశాన్ని వదులుకోకండి.

సిట్రోయెన్ అనేది ఒక ఫ్రెంచ్ దేశానికి చెంది కార్ బ్రాండ్. ఇది ఇండియాలో 2021లో అడుగు పెట్టింది. భారతదేశంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ తన కార్లపై రూ.2.80 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే ఇంత భారీ ఆఫర్ కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఇప్పటికే సిట్రోయెన్ కార్ కలిగి ఉన్నవారికి ఉచిత కార్ స్పా ఆఫర్ కూడా ఇస్తోంది. ఈ వార్షికోత్సవ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?

రూ. 2.80 లక్షల వరకు డిస్కౌంట్

సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీ ధర రూ.8.32 లక్షలు కాగా, ఈ కారుపై రూ.2.80 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే సిట్రోయెన్ కార్ కలిగి ఉన్నవారు కొత్త కారు కొనుగోలు చేస్తే ఉచిత కార్ స్పా పొందవచ్చు. ఈ ఆఫర్ జూన్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 

సిట్రోయెన్ కార్ల అమ్మకాలు ఇలా..

ప్రస్తుతం సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్, e-C3 ఎలక్ట్రిక్, C3 ఎయిర్‌క్రాస్‌లను అమ్ముతోంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన SUV కూపే బసాల్ట్ కూడా మంచి ఆఫర్స్ తో లభిస్తోంది. మే 2025లో కంపెనీ కేవలం 333 యూనిట్లను అమ్మింది. మే 2024లో 515 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 2025లో కంపెనీ 339 యూనిట్లను అమ్మింది. 

కస్టమర్లను ఆకర్షించేందుకే భారీ డిస్కౌంట్లు

గత నాలుగు సంవత్సరాలుగా భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్లను విడుదల చేసి కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించామని కంపెనీ తెలిపింది. అమ్మకాలను పెంచుకునేందుకు త్వరలోనే మరింత మెరుగైన మోడళ్లను తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ సిట్రోయెన్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయినప్పటికీ కార్లపై రూ.2.80 లక్షల వరకు డిస్కౌంట్లు ఇవ్వడం విశేషం. సిట్రోయెన్ కార్లలో ఎలాంటి లోపాలు లేవు. కానీ బ్రాండ్ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ప్రస్తుతానికి సిట్రోయెన్ కార్లు మనం పెట్టిన డబ్బుకు వంద శాతం న్యాయం చేస్తాయని మాత్రం చెప్పగలం.