ఆంధ్ర ప్రదేశ్ లో బుధ, గురువారాలు(నేడు, రేపు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24గంటల్లో వాయుగుండగా మారనుందని... దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరించింది. ఇక ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడుపై కూడా ఈ వాయుగుండం ప్రభావం వుండనుందని... రెండురోజుల పాటు అక్కడ కూడా వర్షాలు కొనసాగుతాయని ఐఎండి ప్రకటించింది. 

ఇక ఇప్పటికే నెల్లూరు జిల్లాలో heavy rains కురుస్తున్నాయి. ఈ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే అవకాశముందన్న ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో AP Government అప్రమత్తమయ్యింది. ప్రజలకు అందుబాటులో వుండాలని... వర్షాల కారణంగా ప్రజలు ప్రమాదాలకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 

ఇక వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా వుండనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీరం వెంబడి గంటలకు 40‌-50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని అధికారులు మరింత అప్రమత్తంగా వుండాలని సూచించారు.

read more కాంచీపురం, చెంగల్పట్టుకు రెయిన్ అలర్ట్ ఇస్తే.. చెన్నైలో వాన ఎలా పడింది, కారణమిదే..!!!

ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా విస్తృతంగా కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు, ఏపీ అధికారులు ముందస్తుగానే అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఇప్పటికే భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. ఈ ఏడాది అక్టోబరు 25వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడులోని అనేక జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ నెల 11వ తేదీ వరకు తమిళనాడుకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 

తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని వందలాది కాలనీలు నీటిలోనే మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

read more ‘‘ నీటి కోసం ఏడ్చి .. నీళ్లలోనే చనిపోయేట్టు చేస్తారు’‘ : చెన్నై కార్పోరేషన్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

Heavy Rains కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. 538 గుడిసెలు, నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయని రాష్ట్ర మంత్రి కెకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. గురువారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వుండాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని జలాశయాలు, చెరువుల్లో భారీగా నీరుంది. అలాగే నదులు, వాగులువంకల్లో కూడా అధికంగా నీరుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షసూచన నేపథ్యంలో వీటిలో వరదనీరు చేరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో వుంచుకుని ఏపీలో ముందుగానే అధికారులు అప్రమత్తం అవుతున్నారు.