ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం నిద్రలేచిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పన్న సన్నిధిలో చందనోత్సవ సమయంలో క్యూ లైన్‌లో ఉన్న భక్తులపై ఒక్కసారిగా భారీ గోడ కూలింది. ఈ సంఘటనలో 7 గురు భక్తులు మరణించారు.
భారీ వర్షాల కారణంగా రూ. 300 టికెట్ క్యూలైన్‌లో ఉన్న భక్తులపై ఒక్కసారిగా భారీ గోడ కూలింది. ఈ ఘటనలో 7 గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శిథిలా కింత మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలా కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ విషాద సంఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం:
ఇదిలా ఉంటే శిథిలాల కింద మరికొంత మంది ఉండడం, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
