Telugu

Gold bangles: డైలీవేర్ కి గాజులు కావాలా? ఇవి బెస్ట్ ఆప్షన్

Telugu

ప్లెయిన్ గోల్డ్ గాజు

ప్లెయిన్ గోల్డ్ గాజు ఎవర్‍గ్రీన్, క్లాసిక్ ఆప్షన్. దీని సింపుల్ లుక్ అన్ని వయసుల మహిళలకు నప్పుతుంది. రోజూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని ధరించవచ్చు.

Image credits: pinterest
Telugu

కట్‍వర్క్ డిజైన్ గాజు

కట్‍వర్క్ డిజైన్ ఉన్న గాజు సింపుల్‌గా ఉండటంతో పాటు స్టైలిష్‌గా కూడా కనిపిస్తుంది. దీనిపై ఉండే లైట్ వర్క్ లేదా ప్యాటర్న్.. రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ గోల్డ్ గాజు

ట్విస్టెడ్ డిజైన్ గాజుకు కాస్త యూనిక్ టచ్ ఇస్తుంది. ఈ డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ భిన్నంగా కనిపిస్తుంది. క్యాజువల్ వేర్‌కు ఇది మంచి ఆప్షన్.

Image credits: pinterest
Telugu

మ్యాట్ ఫినిష్ గాజు

మ్యాట్ ఫినిష్ గోల్డ్ గాజులు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి మరీ ఎక్కువగా మెరవవు. అందుకే రోజూ వేసుకోవడానికి సౌకర్యంగా, ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

స్లిమ్ చైన్ స్టైల్ గాజు

చైన్ స్టైల్ గాజు తేలికగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇది ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అన్ని రకాల దుస్తులతో సులభంగా మ్యాచ్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

మినమల్ స్టోన్ గాజు

చిన్న చిన్న రాళ్లతో ఉన్న సింపుల్ గోల్డ్ గాజు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మరీ బరువుగా ఉండదు. కాబట్టి రోజూ వేసుకోవడానికి ఇది సరైన ఎంపిక.

Image credits: pinterest
Telugu

ఓపెన్ కఫ్ స్టైల్ గాజు

ఓపెన్ కఫ్ డిజైన్ గాజు వేసుకోవడానికి సులభంగా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని మోడ్రన్ లుక్.. రోజూవారీ వాడకానికి దీన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇది ఏ చేతికైనా చక్కగా నప్పుతుంది.

Image credits: pinterest

Summer Fashion: వేసవికి అనువైన స్టైలిష్, కంఫర్టబుల్ కుర్తా సెట్స్

Fashion Tips: చూడచక్కని రంగుల్లో ఖున్ శారీస్.. చూస్తే వావ్ అనాల్సిందే

Red Stone Toe Rings:పాదాల అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ మెట్టెలు

Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అవిసెగింజలు ఇలా వాడితే చాలు