S-400 రష్యా నిర్మించిన వైమానిక రక్షణ వ్యవస్థ. భారతదేశం దీన్ని కొనుగోలు చేసింది. దీని క్షిపణి పరిధి 400 కి.మీ., రాడార్ పరిధి 600 కి.మీ.
డేవిడ్ స్లింగ్‌ను ఇజ్రాయెల్ రాఫెల్, రేథియాన్ కలిసి తయారు చేశాయి. పరిధి 300 కి.మీ. దీనితో క్షిపణులు, యుద్ధ విమానాలను గాల్లోనే నాశనం చేయవచ్చు.
S-300VM రష్యా నిర్మించిన వైమానిక రక్షణ వ్యవస్థ. దీని పరిధి 200 కి.మీ. దూరం, 30 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. ఇది బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ విమానాలను అడ్డుకోగలదు.
టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) అమెరికన్ వైమానిక రక్షణ వ్యవస్థ. దీన్ని బాలిస్టిక్ క్షిపణులను వాటి చివరి దశలో అడ్డుకోవడానికి రూపొందించారు. దీని పరిధి 200 కి.మీ.
అమెరికన్ కంపెనీలు లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ నిర్మించిన MIM-104 పేట్రియాట్ పరిధి 170 కి.మీ. ఇది బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు.
యూరోసామ్ Aster 30 SAMP/Tని నిర్మించింది. దీని పరిధి 120 కి.మీ., ఎత్తు 20 కి.మీ. ఇది యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలదు.
USA, జర్మనీ, ఇటలీ కలిసి దీన్ని తయారు చేశాయి. MEADS 360 డిగ్రీల కవరేజ్ కలిగిన రోడ్-మొబైల్ వ్యవస్థ. దీని పరిధి 40-70 కి.మీ. దీని క్షిపణులు 20 కి.మీ. ఎత్తులో లక్ష్యాలను నాశనం చేయగలవు.
బరాక్-8ని ఇజ్రాయెల్, భారతదేశం కలిసి తయారు చేశాయి. ఇది 70 కి.మీ. వరకు హెలికాప్టర్లు, నౌకల వ్యతిరేక క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలకు వ్యతిరేకంగా 360 డిగ్రీల రక్షణ కల్పిస్తుంది.
ఐరన్ డోమ్ అనేది చిన్న దూర వ్యవస్థ, దీన్ని మోర్టార్లు, రాకెట్లు, ఫిరంగులను అడ్డుకోవడానికి రూపొందించారు. దీని పరిధి 70 కి.మీ.
చైనా రష్యా S-300ని కాపీ కొట్టి HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థను తయారు చేసింది. ఇది విమానాలు, UAVలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేస్తుంది.