Telugu

పులిపిర్లకు పరిష్కారం

పులిపిర్లతో చింతిస్తున్నారా? కొందరికి నొప్పిగా ఉంటుంది. కొందరికి అసౌకర్యంగా ఉంటుంది. బయటకు రావడానికి ఇబ్బంది పడతారు. కంగారుపడకుండా ఇంట్లో వస్తువులతోనే వీటికి చెక్ పెట్టేయండి

Telugu

వెల్లుల్లి రెబ్బలు

వెల్లుల్లిలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. వెల్లుల్లిని పేస్ట్‌లా చేసి పులిపిరిపై రాయండి. దానిపై బ్యాండేజ్ వేసి రాత్రంతా ఉంచండి. వారం రోజుల్లో రాలిపోయి ఫలితం కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

ఆపిల్ సైడర్ వెనిగర్

ఇందులోని ఎసిటిక్ యాసిడ్ వైరస్‌ను చంపుతుంది. కాటన్ బాల్‌ను వెనిగర్‌లో ముంచి పులిపిరిపై ఉంచండి. పులిపిరి క్రమంగా నల్లగా మారి రాలిపోతుంది.

Image credits: Getty
Telugu

అరటిపండు తొక్క

అరటి తొక్కలోని ఎంజైమ్‌లు పులిపిర్లను తొలగిస్తాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని పులిపిరిపై ఉంచి టేప్ వేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

Image credits: Gemini AI
Telugu

కలబంద (Aloe Vera)

కలబందలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. కలబంద జెల్‌ను పులిపిరిపై రోజుకు రెండుసార్లు అప్లై చేయండి. ఇది ఇన్ఫెక్షన్‌ను తగ్గించి చర్మాన్ని చల్లబరుస్తుంది.

Image credits: ChatGPT
Telugu

నిమ్మరసం

నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ పులిపిర్లను ఎండబెట్టడానికి సహాయపడుతుంది. తాజా నిమ్మరసాన్ని పులిపిరిపై రోజూ రాయడం వల్ల అది క్రమంగా రాలిపోతుంది. 

Image credits: chat GPT
Telugu

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ యాంటీ సెప్టిక్. కొబ్బరి నూనెతో కలిపి పులిపిరిపై రాయండి. ఇది వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో బాగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

జాగ్రత్తలు తప్పనిసరి

పులిపిర్లను గిల్లకుండా ఉండండి. ఇతర వ్యక్తులు వాడిన టవల్స్ వాడకండి. సమస్య తీవ్రంగా ఉంటే చర్మ నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Image credits: chatgpt

Gold Rings: కేవలం ఒక్క గ్రాములో అందమైన గోల్డ్ ఉంగరాలు

Gold Cuff Earrings: ఇవి మీ చెవులకు ఉంటే మహారాణిలా మెరిసిపోతారు

Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ

Maharani Anklets: పాాదాలకు మహారాణి వెండి పట్టీలు.. డిజైన్లు ఇవిగో