Kitchen Hacks: మీ ఇంట్లో చేపల వాసన వస్తుందా? ఈ టిప్స్ పాటించండి..
life Jul 13 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
లవంగాలు, దాల్చిన చెక్క
చేపలు కడిగిన తర్వాత వచ్చే దుర్వాసనను తొలగించాలంటే.. ఒక గిన్నెలో నీరు పోసి అందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసి మరిగించండి. ఆ ఆవిరితో ఇల్లు సుగంధంగా మారి, దుర్వాసన పూర్తిగా పోతుంది.
Image credits: Getty
Telugu
చేపల వ్యర్థాలు
చేపల వ్యర్థాలు డ్రైనేజీలో పేరుకుపోతే దుర్వాసన వస్తుంది. ఇందుకోసం కొంచెం బేకింగ్ సోడా డ్రైనేజీలో వేసి, ఆపై వినిగర్ పోసి కొంత సేపు వేచి ఉండండి. తర్వాత వేడి నీళ్లు పోస్తే సరే.
Image credits: Getty
Telugu
బేకింగ్ సోడా
దుర్వాసన వచ్చే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడా చల్లితే, అది వాసనను గ్రహించి తటస్థం చేస్తుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో సులభంగా దుర్వాసనను పోగొట్టవచ్చు.
Image credits: Getty
Telugu
నిమ్మకాయ
కిచెన్ సింక్‌ను నిమ్మకాయతో రుద్ది కడిగితే దుర్వాసనను తొలగిస్తుంది. ముఖ్యంగా చేపల వాసన పోవడానికి ఇది మంచి పరిష్కారం
Image credits: Getty
Telugu
కాఫీ పొడి
వంటగదిలో దుర్వాసనను తొలగించాలంటే.. ఒక గిన్నెలో కాఫీ పొడి లేదా బేకింగ్ సోడా వేసి తెరిచి ఉంచండి. ఇవి గాలిలోని వాసనను శోషించి, ప్రదేశాన్ని సువాసన భరితంగా మార్చుతుంది.
Image credits: Getty
Telugu
తాజా గాలి కోసం
చేపలు శుభ్రం చేసేటప్పుడు లేదా వండేటప్పుడు కిటికీలు ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. దీంతో గాలి సరఫరా సాగుతూ, దుర్వాసన వంటగదిలో నిలిచిపోకుండా బయటకు వెళుతుంది.
Image credits: Getty
Telugu
ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు
చేపలను డైరెక్ట్ గా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇలా ఉంచితే దుర్వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాపిస్తుంది. వీలైతే అరటి ఆకు లేదా మూత ఉన్న డబ్బాలో పెట్టాలి. అరటి ఆకు సహజంగా వాసనను తగ్గిస్తాయి.