కిచెన్‌లో కిటికీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఉండాలి. వాటి ద్వారా పొగ, వాసన వెంటనే బయటకు వెళ్లిపోతాయి.
Image credits: chat gpt
Telugu
సహజమైన ఎయిర్ ఫ్రెషనర్లు
ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, అందులో నిమ్మకాయ, దాల్చిన చెక్క లేదా లవంగాలను వేసి మరిగించాలి. ఆ గిన్నెను కిచెన్‌లో పెట్టాలి. దీనివల్ల సహజమైన సువాసన వ్యాపించి, చెడు వాసన పోతుంది.
Image credits: chat gpt
Telugu
చెత్తను వెంటనే తీసేయాలి
వంట చేసిన తర్వాత తడి చెత్తను కిచెన్‌లో ఎక్కువసేపు ఉంచవద్దు. డస్ట్‌బిన్‌ను రోజూ శుభ్రం చేయాలి. అలాగే మూత ఉన్న డస్ట్‌బిన్‌ను మాత్రమే వాడాలి.
Image credits: chat gpt
Telugu
చిమ్నీ, ఫిల్టర్‌ను శుభ్రం చేయడం
కిచెన్ చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫిల్టర్‌లో జిడ్డు పేరుకుపోతుంది. దీనివల్ల వాసన ఎక్కువవుతుంది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా అవసరం.
Image credits: chat gpt
Telugu
కాఫీ లేదా బేకింగ్ సోడా
కిచెన్‌లో ఒక గిన్నెలో కాఫీ పొడి లేదా బేకింగ్ సోడాను ఉంచాలి. ఇవి చెడు వాసనను పీల్చుకొని, గాలిని తాజాగా ఉంచుతాయి.